Health tips | వర్షాకాలం అలర్జీలా.. ఈ చిట్కాలతో నయం చేసుకోండి..!

Health tips | వర్షాకాలం వచ్చిందంటే కొందరిని అలర్జీలు వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో వర్షం నీటిలో తడిస్తే దగ్గు, జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్స్‌ వస్తుంటాయి. హోమ్‌ రెమెడీస్‌ వినియోగించడం వల్ల స్కిన్‌ అలర్జీల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. హోమ్‌ రెమెడీస్‌ చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయని అంటున్నారు. అయితే ఎలాంటి హోమ్‌ రెమెడీస్‌ను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • By: Thyagi |    health |    Published on : Aug 07, 2024 7:00 PM IST
Health tips | వర్షాకాలం అలర్జీలా.. ఈ చిట్కాలతో నయం చేసుకోండి..!

Health tips : వర్షాకాలం వచ్చిందంటే కొందరిని అలర్జీలు వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో వర్షం నీటిలో తడిస్తే దగ్గు, జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్స్‌ వస్తుంటాయి. హోమ్‌ రెమెడీస్‌ వినియోగించడం వల్ల స్కిన్‌ అలర్జీల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. హోమ్‌ రెమెడీస్‌ చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయని అంటున్నారు. అయితే ఎలాంటి హోమ్‌ రెమెడీస్‌ను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా వానాకాలంలో అలర్జీ సమస్యలు రాకుండా ఉండాలంటే శుభ్రమైన కాటన్ దుస్తులను ధరించాలి. వర్షాకాలంలో ఉతికిన దుస్తులు కాకుండా చెమట పట్టిన దుస్తులు ధరించడంవల్ల బ్యాక్టీరియా చర్మంపై చేరి అలర్జీ సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే చర్మంపై అలర్జీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రభావిత ప్రాంతాల్లో కొబ్బరి నూనెను వినియోగించాలి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల అలర్జీలతో వచ్చే దురదను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

అలర్జీ కారణంగా వచ్చే దురదకు టీ ట్రీ ఆయిల్‌ వాడటం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దురదగల ప్రదేశంలో ఈ నూనెను అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాన్ని పొందుతారు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

అలర్జీ వచ్చిన ప్రాంతాల్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ను అప్లై చేయడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఎసిటిక్ యాసిడ్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది చర్మంపై మంట, దురద ప్రభావాన్ని తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మీరు ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ మిక్స్‌ చేసి ప్రభావిత ప్రాంతంలో రాసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడాతో కూడా సులభంగా చర్మంపై అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు దురదను తగ్గించేందుకు ప్రభావంతంగా సాయపడుతాయి. దీని కోసం ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకుని అలెర్జీ ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరలోనే అలెర్జీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

Health tips | మీలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నదా.. అయితే ఈ పండ్లు తప్పక తినండి..!

Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్‌ చేయొద్దు..!

Health tips | మహిళలూ ఆ శుభ్రతపై అశ్రద్ధ అస్సలే వద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!

Health tips | తరచూ అవకాడో తింటే మధుమేహం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్‌..!

Health tips | షుగర్‌ రోగులు తరచూ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!