Heart attacks | గుండెపోట్లు ఎక్కువగా బాత్రూమ్‌లో ఉన్నప్పుడే వస్తాయెందుకు..?
Heart attacks : కాలంతోపాటే మానవ జీవనశైలి మారిపోయింది. ఇప్పటి ఆహారపదార్థాలు, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ రోగాలు పెరిగిపోతున్నాయి. హృద్రోగ మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. ఒకప్పుడు వయసు మళ్లిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు పాతికేళ్ల యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.
Heart attacks : కాలంతోపాటే మానవ జీవనశైలి మారిపోయింది. ఇప్పటి ఆహారపదార్థాలు, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, హృదయ సంబంధ రోగాలు పెరిగిపోతున్నాయి. హృద్రోగ మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. ఒకప్పుడు వయసు మళ్లిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు పాతికేళ్ల యువత కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులోనూ చాలామంది బాత్రూమ్‌లలోనే గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. అమెరికా ఏజెన్సీ NCBI లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం గుండెపోటు మరణాలు బాత్రూమ్‌లలోనే చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బాత్రూమ్‌లలోనే గుండెపోటు మరణాలు సంభవిస్తుండటానికి గల కారణాలను నిపుణులు వెల్లడించారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్నానం చేసేటప్పుడు చాలామంది ముందుగా తలని తడుపుకుంటారు. దానివల్ల వేడి రక్తంగల శరీరం ఒక్కసారిగా చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. అన్ని వైపుల నుంచి తల భాగం వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆ సమయంలో రక్త నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. శీతాకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడుపుకుని ఆ తర్వాత పైవైపునకు వెళ్లడం శ్రేయస్కరం. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు ఈ విధానాన్ని పాటించాలి.
ఇక బాత్రూమ్‌లో గుండెపోటు మరణాలు అధికంగా సంభవించడానికి మరో కారణం మలబద్ధకం. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు విసర్జణ సమయంలో బాత్రూమ్‌లో ముక్కుతుంటారు. ఇలా ముక్కినప్పుడు రక్తనాళాల్లోని రక్తం ఎక్కువ పీడనంతో గుండెవైపునకు ఎగిసి వస్తుంది. దాంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య రావద్దంటే మలబద్ధకం ఉన్నవాళ్లు వైద్యులను సంప్రదించి సంబంధిత మెడికేషన్ తీసుకోవాలి. ఈ విధంగా గుండె సంబంధ రోగులు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు, మలబద్ధకం సమస్య ఉన్నవారు బాత్రూమ్‌లకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram