పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్
పోక్సో కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా బండి భగీరథ్ సిట్ ఎదుట గైర్హాజరయ్యారు. తదుపరి చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బుధవారం సిట్ విచారణకు హాజరు కాలేదు. పోలీసులు ముందుస్తుగా నోటీసులు ఇచ్చినప్పటికి విచారణకు రాకపోవడంపై పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా సమాచారం. దీంతో భగీరథ్ పై తదుపరి చట్టపరమైన చర్యలకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు.
పోక్సో కేసులో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరుకావాలని పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ కు నోటీసులు ఇచ్చారు. కరీంనగర్ లోని భగీరథ్ ఇంటికి పోలీసులు వెళ్లగా ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందించడం గమనార్హం. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలంటూ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పోస్టర్లు వేయడం ఆసక్తి రేపింది. ఈ కేసును కూకట్ పల్లి డీసీసీ, ఐపీఎస్ రీతురాజ్ సిట్ బృందం విచారిస్తుంది.
అయితే రేపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉన్నందునే..నిందితుడు భగీరథ్ పోలీస్ విచారణకు హాజరుకాలేదని తెలుస్తుంది. మరోవైపు బండి భగీరథ్ ను అరెస్టు చేయకపోవడం పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఇవ్వాల్సిన నోటీసులు అతని మేనమామకు ఎలా ఇస్తారు ? అంటూ అటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఆయన తండ్రి బండి సంజయ్, నిన్న కరీంనగర్‌లో ఒక యాత్రలో పాల్గొన్నాడని..నోటీసులు అతనికి ఎందుకు ఇవ్వలేదు ? అని, మేనమామకు నోటీసులు ఇవ్వొచ్చని ఏ చట్టంలో ఉందో డీజీపీ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
విశ్వగురు ! నిజాలు దాస్తున్నారా!..ఆర్థిక బుడగ పేలనుందా ?
భగీరథ్ దేశం వదిలిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి : టీఆర్ఎస్ చీఫ్ కవిత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram