జవహార్ నగర్ చోరీ..నేపాలీ దంపతుల అరెస్టు

జవహార్ నగర్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను కట్టేసి భారీ చోరీ చేసిన నేపాలీ దంపతులను పోలీసులు నేపాల్ సరిహద్దులో అరెస్టు చేశారు. 75 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ జవహార్ నగర్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను కట్టివేసి చోరీకి పాల్పడి పారిపోయిన నెపాలీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పనిమనిషిగా ఇంట్లో చేరి..పక్కా పథకంతో ఈ నెల 12న చోరికి పాల్పడిన నేపాలీ దంపతులు మమత, ఆమె భర్త రమేశ్‌తో పాటు సబీనాను నేపాల్‌ సరిహద్దులో పట్టుకున్నారు. 8 మంది నేపాలీ ముఠా సభ్యులు చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని గోల్ఫ్‌ ఎన్‌క్లేవ్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్‌ దంపతులను కట్టేసి నెపాలీ ముఠా చోరీకి పాల్పడింది. 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, రూ.30 వేల నగదు, 3 వేల డాలర్లతో పరారయ్యారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందితులను పట్టుకోగలిగారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లో హత్యకు గురైన రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ రంజన్‌ రే భార్య తనూజ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి :

షాకింగ్ ఘటన.. రూ.2వేలు అద్దె చెల్లించలేక యజమాని వద్దకు భార్య, బిడ్డ
మోదీ పర్యటన..భారత్ కు చోళుల రాగి శాసనాలను తిరిగిచ్చేసిన నెదర్లాండ్

Latest News