భగీరథ్ దేశం వదిలిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి : టీఆర్ఎస్ చీఫ్ కవిత

బండి భగీరథ్ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. అప్పుడే కేసులో పారదర్శక విచారణపై మహిళలకు నమ్మకం కలుగుతుందన్నారు.

ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దేశం వదిలి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ పోలీసులను డిమాండ్ చేశారు. అప్పుడే పారదర్శకంగా విచారణ జరుగుతుందని తెలంగాణ మహిళలకు విశ్వాసం వస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేరస్తులు దేశం దాటించే అలవాటు ఉందని కవిత ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌పై కవిత తీవ్ర విమర్శలు

బండి సంజయ్ కొడుకు కేసులో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యుత్సాహంతో బాధిత మైనర్ బాలిక ఫోటోలు బయటపెట్టి తప్పు చేసిందని కవిత విమర్శించారు. ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమవుతుందని మండిపడ్డారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేటట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టే అకౌంట్లను బ్లాక్ చేసి, వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.

తెలంగాణ మోదీ పొదుపు సూత్రాలు..ఆంధ్రాకు నిధులు

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటకు వచ్చి పొదుపు సూత్రాలు చెప్పారని, ఆంధ్రాకు మాత్రం పైసలు ఇచ్చారు అని కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కనీసం మాట్లాడలేదు. జనగణనలో ఇళ్ల లెక్క అయిపోగా. ఇక జన గణన ఉంటుంది కాబట్టి కచ్చితంగా వాటిలో ఓబీసీ కాలం పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు. కులంతో పాటు ఉపకులం, సామాజిక స్థితిగుతులను పరిగణలోకి తీసుకోవాలని మేం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని కవిత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

సీఎం విజయ్ కీలక నిర్ణయం..ఓఎస్డీగా రాధన్ పండిట్ తొలగింపు
బండి భగీరథ్ పరారీ…పోస్టర్ల కలకలం

Latest News