హైదరాబాద్ నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర కీలకం అని..అయితే రాష్ట్రంలో గుంపు మేస్త్రీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆగమావుతున్నాయని, అందుకే గుంపు మేస్త్రీ హఠావో….తెలంగాణ బచావో అంటున్నామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి మద్దతునిచ్చి మాట్లాడారు. సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లను పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టటం ఖాయం అని కాంగ్రెస్ ను హెచ్చరించారు. ప్రభుత్వం సెంట్రింగ్ కార్మికులతో సాయంత్రం లోపు చర్చలు జరపాలని, రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే వాళ్లతో పాటు నేను ధర్నాలో కూర్చుంటానని తెలిపారు.
హైడ్రా కూల్చివేతలతో సెంట్రింగ్ కార్మికులకు నష్టాలు
హైదరాబాద్ లో అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానిలో సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. తాళ్లు కట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి గాలిలో వేలాడుతూ మీరు పనిచేస్తున్నారని, సెంట్రింగ్ కార్మికులు లేకుంటే అద్దాల మేడాలు ఉండవన్నారు. కానీ బిల్డింగ్ లు నిర్మించే అగ్రిమెంట్ లో మాత్రం మీ పేరు పెట్టటం లేదు అని, 2 లక్షల రూపాయల పనికోసం మీరు వెళ్తున్నప్పటికీ మీతో పాటు 15 లక్షల రూపాయల మెటీరియల్ తీసుకెళ్తున్నారని, కానీ మీ మెటీరియల్ కు కనీసం రక్షణ లేని పరిస్థితి ఉందన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత నోటీసులు లేకుండా ఇళ్లు కూలగొడుతున్నారని, దీంతో సెంట్రింగ్ పనిచేస్తున్న మీకు ఆ ఇళ్లు కూల్చే సమయంలో మీ మెటీరియల్ నష్టపోతున్నారని కవిత పేర్కొన్నారు. దీనికి ఇంటి యాజమాని గానీ ప్రభుత్వం గానీ మీకు పరిహారం ఇవ్వటం లేదని, 86 చోట్ల సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు పదిరోజులుగా పని బంద్ చేశారని, కానీ మీ దగ్గర ఉన్న కూలీలను మీరే పోషిస్తు మరింత ఆర్థిక భారం మోస్తున్నారని, మీరు చూపిస్తున్న మానవత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా చూపించాలని కవిత డిమాండ్ చేశారు.
కార్మికుల డిమాండ్లు ఆమోద యోగ్యం
సెంట్రింగ్ కార్మికులకు ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్ కు 51 రూపాయలు, కార్మికులు చనిపోతే ఇచ్చే డబ్బులు పది నుంచి 20 లక్షలు అడుగుతున్నారని, వాళ్లు అడిగే అన్ని డిమాండ్లు కూడా సహేతుకమైనవే. వాటికి మేము మద్దతు తెలుపుతున్నాం అని కవిత ప్రకటించారు. ఇప్పుడు మేస్త్రీలు స్వ్కేర్ ఫీట్ కు 4 వందలు అడుగుతున్నారని చెబుతున్నారని, దానిలో సెంట్రింగ్ కార్మికుల వాటా ఎంతో కూడా చెప్పాలి? అని, మేస్త్రీలో చేతిలో ఎట్టి పరిస్థితుల్లో మీ జుట్టు ఉండకూడదు అని తెలిపారు. తెలంగాణ రక్షణసేన అధికారంలో వచ్చిన తర్వాత మీ అన్నిడిమాండ్లను తీరుస్తాం అన్నారు. 186 చోట్ల వెయ్యి నుంచి 2 వేల గజాల స్థలం మీకు ఇస్తాం అని, ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉందని కవిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
పోలీస్ ఫిర్యాదులకు బహుభాషా ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్
