• Telugu News
  • /Hyderabad

మా మీద నుండి జేసీబీ ఎక్కించినా సరే మా భూములు ఇవ్వం

కోహెడ గ్రామంలో ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం భూసేకరణకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. జేసీబీ ముందు పడుకుని తమ భూములు ఇవ్వమంటూ నిరసన తెలిపారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | May 25, 2026, 4:24 pm IST
Read Time: 2 mins
మా మీద నుండి జేసీబీ ఎక్కించినా సరే మా భూములు ఇవ్వం

రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు కోసం భూ సేకరణ చేసేందుకు వచ్చిన అధికారులకు స్థానిక రైతులు, ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అధికారులను అడ్డుకుని, మండుటెండలో జేసీబీకి అడ్డంగా పడుకున్న రైతులు భూసేకరణను వ్యతిరేకిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో భారీ సంఖ్యలో అక్కడ పోలీసులను మోహరించి భూసేకరణ ప్రక్రియకు అధికారులు సిద్దమయ్యారు.

ఇవి కూడా చదవండి :

రైతులకు క్షమాపణలు చెబుతున్నాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నాయకుల భేటీ