Indian Tourists Sentenced To Jail In Singapore | సింగపూర్ లో వేశ్యలపై ఇండియన్ టూరిస్టుల దాడి
సింగపూర్‌లో వేశ్యలపై దాడి చేసిన ఇద్దరు ఇండియన్ టూరిస్టులకు కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెత్తం దెబ్బలు విధించింది. ఘటన వైరల్.

న్యూఢిల్లీ: సింగపూర్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన ఇద్దరు ఇండియన్ టూరిస్టులు వేశ్యలపై దాడి చేసి కటాకటాల పాలైన ఘటన వైరల్ గా మారింది. గత ఏప్రిల్ 24న వేసవి సెలవులను ఎంజాయ్ చేద్దామని ఆరోక్కియసామి డైసన్(23), రాజేంద్రన్(27) లు సింగపూర్ వెళ్లారు. అక్కడ వారిద్దరూ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇద్దరు వేశ్యల దగ్గరికి వెళ్లారు. డైసన్, రాజేంద్రన్ లు డబ్బుల కోసం ఇద్దరు వేశ్యలపై దాడి చేయడంతో పాటు హోటల్ రూమ్ లో చోరికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి..విచారణ అనంతరం ఇటీవల కోర్టులో హాజరుపరిచారు. తమ దగ్గర డబ్బులు లేనందునే ఇలా చేశామని యువకులు కోర్టుకు వివరించారు. వాదనలు విన్న సింగపూర్ కోర్టు డైసన్, రాజేంద్రన్ లకు 5 సంవత్సరాల 1నెల జైలు శిక్షతో పాటు, 12 బెత్తం దెబ్బలు శిక్ష విధించింది. ఈ ఘటన విదేశాలకు వెళ్లినప్పుడు ఎంత క్రమశిక్షణతో ఉండాలో వెల్లడిస్తుంది. సింగపూర్ కావడంతో వారిద్దరూ ఆ మాత్రం శిక్షతో బయటపడ్డారని..గల్ఫ్ కంట్రీలలో అయితే మరింత కఠిన శిక్షలకు గురయ్యేవారని మరికొందరు నెటిజన్లు మాత్రం అభిప్రాయపడ్డారు.