అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగుతుండటంతో భారత్ మార్కెట్‌లోనూ పసిడి ధరలు భారీగా తగ్గాయి. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందిన కొనుగోలుదారులకు ఇది కొంత ఊరటనిచ్చే పరిణామంగా మారింది. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,000 తగ్గి రూ. 1,52,730వద్ద ఆగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,750 తగ్గి రూ. 1,40,000కు పడిపోయింది. ఇదే సమయంలో వెండి ధరల్లోనూ ఒకేసారి భారీ తగ్గుదల నమోదైంది. కిలో వెండి ధర సైతం రూ. 10,000 తగ్గి రూ. 2,70,000కు పడిపోయింది. గత 10రోజులలో వెండి కనిష్ట ధర ఇదే కావడం గమనార్హం.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
విజయవాడ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,910గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,000 వద్ద నిలిచింది. ముంబై నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారోట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,150 పలుకుతోంది. ఇక అహ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,810 దగ్గర నిలిచింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,40,050 పలుకుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది. కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది. విశాఖలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 వద్ద కొనసాగుతుండగా..22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 పలుకుతోంది.
