విధాత: ప్రపంచ దేశాలను వణికించిన కోవిడ్ వైరస్ చేసిన వినాశనం మరువకముందే.. అంతకు మించిన వైరస్ మరొకటి దూసుకొస్తుంది. ప్రమాదకరమైన హంటా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. హంటా వైరస్ నియంత్రణకు వివిధ దేశాలతో కలిసి డబ్ల్యూహెచ్ వో పనిచేస్తోందని వెల్లడించింది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్లు, మందులు లేవు అని.. త్వరగా గుర్తించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువని ఆందోళన వ్యక్తం అవుతుంది. హంటా వైరస్ సోకితే జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, అలసట, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ వల్ల ఊపిరితిత్తులలో ద్రవం చేరి, శ్వాస ఆడక మరణించే అవకాశం ఉంటుంది.
అంటార్కిటికా ఖండం, అట్లాంటిక్ మహా సముద్రంలోని మారుమూల దీవులను సందర్శించడానికి ‘ఎంవీ హోండియస్’ డచ్ క్రూయిజ్ నౌకలో బయల్దేరిన పర్యాటకులలో కొందరికి హంతా వైరస్ సోకింది. నౌకలో 88 మంది పర్యాటకులు, 55 మంది సిబ్బంది మొత్తం 150 మంది ఉన్నారు. 23 దేశాలకు చెందిన వీరంతా గత నెల 1న దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా నుంచి బయల్దేరారు. సాధారణంగా ఎలుకల ద్వారా వ్యాపించే అరుదైన, తీవ్రమైన వ్యాధి ‘హంటా వైరస్’ కేసులు ఈ నౌక ప్రయాణికుల్లో బయటపడ్డాయి. హంటా వైరస్ మనుషులకు సోకినప్పుడు ప్రాణాంతకమైన శ్వాసకోశ (HPS) లేదా మూత్రపిండాల సమస్యలను (HFRS) కలిగిస్తుంది. హంటావైరస్ మరణాల రేటు 35% నుండి 45% వరకు ఉంటుందని..ఇది COVID మరణాల రేటు కంటే 440 రెట్లు ఎక్కువని నిపుణుల అంచనా.
నౌకలోని ప్రయాణికుల్లో హంటా వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందడంతో ఒక్కసారిగా హంటా వైరస్ పై అందరి దృష్టి పడింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే రంగప్రవేశం చేసి. నౌకలోనే పర్యాటకులకు పరీక్షలు నిర్వహించింది. హంటా వైరస్ ఆయా దేశాలకు వ్యాపించకుండా సంబంధిత దేశాలను అప్రమత్తం చేసినట్లుగా డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఇప్పటివరకు నిర్ధరణ అయిన కేసులు రెండు, అనుమానిత కేసులు ఐదు నమోదయ్యాయి. మరి కొంత మందికి ఈ వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న ఈ నౌకలోని వారంతా క్వారంటైన్‌లో ఉన్నారు.
వైరస్ సోకిందన్న అనుమానంతో పలువురు పర్యాటకులను నెదర్లాండ్స్‌కు తరలించారు. నౌకలోని సుమారు 40 మంది ప్రయాణికులు సెయింట్ హెలెనాలో దిగిపోయారని డచ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. నౌక నుంచి దిగిన ప్రయాణికులను సెయింట్ హెలినా ద్వీపంలో ఉంచారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని నౌకలో సిబ్బంది సూచించినట్లు ప్రయాణికులు తెలిపారు. “ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు ఈ వైరస్ వల్ల కలిగే ముప్పు చాలా తక్కువగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని WHO స్పష్టం చేసింది.
Hantavirus infection had been CONFIRMED in Switzerland, Hantavirus has a 35%-45% fatality rate, that’s 440 times more than COVID’s. Here is what you need to know about the virus. pic.twitter.com/jQDFmgOywO
— Science Postcard (@Sciencepostcard) May 7, 2026
