విధాత : చైనా, టిబెట్ లలో వరుస భూకంపాల నేపథ్యంలో హిమాలయాలలో చోటుచేసుకుంటున్న మార్పులతో భారీగా మంచు కరిగి మరోసారి నేపాల్ లోకి వరదలు దూసుకోస్తాయంటూ చైనా హెచ్చరికల నేపథ్యంలో నేపాల్ దేశం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. చైనాలో సియాచిన్ లో భారీ భూకంపం సంభవించగా.. భూకంప తీవ్రత 5.1 గా నమోదైంది. నేపాల్ సరిహద్దుల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపాల నేపథ్యంలో మంచు కొండల ప్రాంతాల నుంచిచి 5 రెట్ల అధిక తీవ్రతతో మరోసారి టిబెట్, నేపాల్ లలోకి వరద ముంచెత్తనుందని హెచ్చరిలు జారీ చేశారు. టిబెట్ లో వరద సహాయక చర్యలను నిలిపివేశారు.
వరద ముంచెత్తనుంది..పారిపోండి..
నేపాల్ లో అధికారులు.. మరో 20 నిమిషాలలో మరోసారి జల ప్రళయం సంభవించనుందని, వరద ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనలతో తమ నివాస ప్రాంతాల నుంచి పరుగులు తీస్తుండటం…ఆ దేశంలో నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతుంది.
టిబెట్ లో తెగిన డ్యామ్..నేపాల్ లోకి వరద
టిబెట్ లో డ్యామ్ తెగిపోవడంతో చైనా, నేపాల్ సరిహద్దులలో కొండ చరియలు విరిగి పడుతూ భారీ ఎత్తున వరద నేపాల్ లోకి దూసుకోస్తుందని అధికారులు రెడ్ బెల్ మోగించారు. దీంతో ప్రజలు అంతా సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీస్తున్నారు. నేపాల్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
