Telugu Techie | అమెరికాలో తెలుగు టెక్కీ మృతి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరిన కొన్నాళ్లకే విషాదం

Telugu Techie | అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి.. సాఫ్ట్‌వేర్ జాబ్ పొందిన కొద్దిరోజులకే కన్నుమూసింది. ఏపీకి చెందిన లోకేశ్వరి పిట్టు (28) లుకేమియా (బ్లడ్ క్యాన్సర్‌)తో పోరాడుతూ ప్రాణాలు విడిచింది.

  • By: Chandram |    nri |    Published on : May 13, 2026 9:18 PM IST
Telugu Techie | అమెరికాలో తెలుగు టెక్కీ మృతి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరిన కొన్నాళ్లకే విషాదం

Telugu Techie | అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి.. సాఫ్ట్‌వేర్ జాబ్ పొందిన కొద్దిరోజులకే కన్నుమూసింది. ఏపీకి చెందిన లోకేశ్వరి పిట్టు (28) లుకేమియా (బ్లడ్ క్యాన్సర్‌)తో పోరాడుతూ ప్రాణాలు విడిచింది.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని బాపట్ల జిల్లా పిట్టువారిపాలెం గ్రామానికి చెందిన లోకేశ్వరి పిట్టు ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం అమెరికా వెళ్లింది. నార్త్‌వెస్ట్ మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఆ వెంటనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించింది. జీవితం అంతా సాఫీగా సాగుతుందని అనుకుంటున్న తరుణంలో లోకేశ్వరి లుకేమియా బారిన పడినట్లు తెలిసింది. దీంతో ఆ మహమ్మారి నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడింది. అత్యుత్తమ ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంది. కానీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో తాజాగా తుదిశ్వాస విడిచింది.

లోకేశ్వరి మరణవార్తతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామం పిట్టువారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా తోటి ఎన్నారైలు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ విషయంలో కుటుంబసభ్యులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.