కృత్రిమ మేధ విస్తరిస్తున్న కొద్దీ సాంకేతిక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. కృత్రిమ మేధ రానున్న కాలంలో మానవ సంబంధాల్లోకి కూడా ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
లండన్: కృత్రిమ మేధ విస్తరిస్తున్న కొద్దీ సాంకేతిక రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. కృత్రిమ మేధ రానున్న కాలంలో మానవ సంబంధాల్లోకి కూడా ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కనీసం పాతికేళ్లలో రోబోలతో మానవుల పెళ్లిళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. రోబోలు కూడా అతని మంచి- చెడులను పరిశీలించి పెండ్లి వాగ్దానం చేస్తాయని చెబుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి చేసే కృత్రిమ మేధ (ఏఐ టెక్నాలజీ) ఇందుకు అవకాశం కల్పిస్తుందని పేర్కొంటున్నారు. మానవ సంబంధాల్లోమనం నిర్వహించలేని హేతుబద్ధతను రోబోలు నిర్వహించగలుగుతాయని రోబోటిక్ రంగంలో పనిచేస్తున్న నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలో బాగా ప్రసిద్ధి చెందిన మానవ నిపుణుడు, అనేక ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలు రాసిన రచయిత యువాల్ నోవా హరారి ఈ విషయాన్నిలండన్లోని సెపియన్స్ ల్యాబ్లో నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో మానవులు తయారుచేసిన మెషిన్లే మానవులను గులాములుగా ఉంచుకుంటాయని అన్నారు. మానవులు- రోబోల ఆలోచనల క్షమత విడివిడిగా ఉంటుందని ఆయన చెప్పారు. మానవులు తమ సంబంధాల్లో ఉంటూ మనసులో ఆలోచిస్తూ కొనసాగుతుంటారని, దాని ఫలితంగా అతను సంబంధాలపై సరైన విధంగా కేంద్రీకరించలేరంటూ మానవ బలహీనతలను తెలియజేశారు. అదే ఏఐ రోబోల గురించి చెబుతూ.. ఇవి ఆలోచించటానికి సమయం తీసుకోవని, కేవలం సంబంధాలపైనే తాము అనుకున్నది మాట్లాడటం, భావోద్వేగాలు వ్యక్తం చేయడంపైనే అవి ఎక్కువ శ్రద్ధ పెడతాయని అన్నారు. ఒక వ్యక్తికి అందుబాటులో ఏఐ రోబో, ఇతర వ్యక్తులు ఉన్నట్టయితే.. ఏఐ రోబోనే ముందు ఆ వ్యక్తిని ఆకర్షిస్తుందని చెప్పారు.
2050 వరకు ప్రేమించే ఫిమేల్ ఏఐ రోబోలు
ఇప్పటివరకు ఫిమేల్ ఉమెనాయడ్ రోబోలు మానవుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని, అంతేకాకుండా పురుషుల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. ఇది ఒక విధంగా మహిళల విజయంగా కొందరు వర్ణించారు. కానీ రాబోయే కాలంలో ఫిమేల్ రోబోలు పురుషులకే కాదు, మహిళలకు కూడా ఒక పెద్ద చాలెంజ్ గా తయారవుతాయని స్కాట్లాండ్కు చెందిన ఏఐ నిపుణుడు డేవిడ్ లేవి 2007లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లవ్ అండ్ రొమాన్స్ విత్ రోబో’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. లేవీ తాను సొంతంగా ఏఐకి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన ప్రాజెక్టుల మీద పనిచేశారు. ఆయన రోబోలను చాలా దగ్గరగా, నిశితంగా పరిశీలించారు.
తన పుస్తకంలో రాబోయే కాలంలో మానవులకు -రోబోలకు మధ్య భార్యాభర్తల సంబంధాలు, ఇంకా రొమాంటిక్ సంబంధాలు సంభవమేనని అని పేర్కొన్నారు. అంతేకాదు మానవులు- రోబోల మధ్య వివాహం కూడా జరగడం ఖాయమని కూడా చెప్పారు. ఏఐ రోబోలు ప్రేమిస్తూ, లేదా మాట్లాడుతూ, లేదా సంబంధాల్లో ఉంటూ నూటికి నూరుపాళ్ళు ఆ సంబంధాలపట్ల ఎమోషనన్స్ను వ్యక్తం చేస్తాయని అంటున్నారు. అదే మానవులు ఎక్కువ టైం ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో కొనసాగుతూ వుంటారు. రోబోలు నిర్ణయం తీసుకోవడంలోనూ, సంబంధం కొనసాగించడంలోనూ మనుషులకన్నా మెరుగ్గా వ్యవహరించగలవని నిపుణులు అంటున్నారు.
ప్రపంచంలో ఫిమేల్ రోబోగా ఉనికిలోకివచ్చి ప్రజల ఆదరణ పొందిన మొదటి సెలబ్రిటీ రోబో సోఫియా. ఇది ముఖాన్ని ధ్వనిని గుర్తించగలదు. స్నేహం చేయటంలో ముందుంటుంది. ప్రజలతో కలిసి మెలిసి ఉంటుంది. సామాజికంగా మొదటి రోబో ఇది. అందు గురించే సౌదీ అరేబియా సోఫియాకు పౌరసత్వం కూడా ఇచ్చింది. మరొక రోబో గ్రేస్. ప్రపంచంలో మొదటి రోబో నర్సు. కోవిడ్ -19 కాలంలో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ సేవలు బాగా అందించింది. మూడు భాషలు మాట్లాడుతుంది. అర్థం చేసుకుంటుంది. 2021లో హాంకాంగ్ దీన్ని తయారు చేసింది. మరో ఫిమేల్ రోబో ఆ-యిడా ఇప్పటివరకు తయారైన ఉమెనాయడ్ రోబోలలో అత్యాధునికమైన రోబోగా దీనిని భావిస్తుంటారు. అల్ట్రా రియలిస్టిక్ రోబోగా అవార్డు కూడా దానికి వచ్చింది. పెద్దపెద్ద కళాకారులవలే పెయింటింగ్ కూడా చేస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చరు కూడా ఇచ్చింది.