ఊస‌ర‌వెళ్లిలా మారుతున్న మ‌హిళ చేతివేళ్లు..!

అమెరికాకు చెందిన మోనికా అనే ఓ మహిళకు విచిత్రమైన సమస్య ఉంది. ఆమె చేతివేళ్లు రంగులు మారిపోతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఆమె చేతి వేళ్లలో రెండు రంగులు మారుతాయి. మధ్య వేలు, దాని పక్కన ఉండే ఉంగరం వేలు చ‌ల్ల‌టి వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే తెల్లగా మారిపోతాయి. అవి అలా కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. కాసేపయ్యాక మళ్లీ సాధారణ రంగులోకి అంటే ఆమె శరీరపు రంగులోకి మారిపోతాయి. ఈ విషయాన్ని మోనికా కుమార్తె జూలీ […]

ఊస‌ర‌వెళ్లిలా  మారుతున్న మ‌హిళ చేతివేళ్లు..!

అమెరికాకు చెందిన మోనికా అనే ఓ మహిళకు విచిత్రమైన సమస్య ఉంది. ఆమె చేతివేళ్లు రంగులు మారిపోతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఆమె చేతి వేళ్లలో రెండు రంగులు మారుతాయి. మధ్య వేలు, దాని పక్కన ఉండే ఉంగరం వేలు చ‌ల్ల‌టి వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే తెల్లగా మారిపోతాయి. అవి అలా కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. కాసేపయ్యాక మళ్లీ సాధారణ రంగులోకి అంటే ఆమె శరీరపు రంగులోకి మారిపోతాయి.

ఈ విషయాన్ని మోనికా కుమార్తె జూలీ తన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. రంగుమారిన త‌న త‌ల్లి చేతివేళ్ల ఫొటోను పోస్ట్ చేసింది. మోనికా రంగులు మారే వేళ్ల‌కు సంబంధించిన ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న‌ది. మోనికాకు ఉన్న అరుదైన వ్యాధి వల్లే ఇలా ఆమె వేళ్లు రంగులు మారతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇదొక అరుదైన చర్మవ్యాధి అని, ఈ వ్యాధి పేరు రెయినాడ్స్ సిండ్రోమ్ అని తెలిపారు.

ఈ వ్యాధి ఉన్న వారి చర్మం కింద ఉండే అతి సన్నని రక్తనాళాలు కొన్ని సందర్భాల్లో మరింత సన్నగా మారిపోతాయనీ, దాంతో రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడి ఆ ప్రాంతంలోని చర్మం మొత్తం పాలిపోయినట్టు అవుతుందని పేర్కొన్నారు. చల్లని వాతావరణం కారణంగా మోనికా చేతివేళ్లలో కూడా ఇదే జరిగి అవి తాత్కాలికంగా రంగు మారుతుండవ‌చ్చ‌న్నారు.