థాయ్ లాండ్ లో 2,100ఏళ్ల నాటి భారతీయ బంగారు ఉంగారాల లభ్యం!

థాయ్‌లాండ్‌లో, పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 2,100 సంవత్సరాల నాటి రెండు భారతీయ బంగారు ఉంగరాలను వెలికితీశారు. వాటిలో ఒకటి ప్రాచీన బ్రాహ్మీ లిపిలో చెక్కబడి ఉంది. ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియాతో భారతదేశానికి ఉన్న వర్ధమాన వాణిజ్యం, సంస్కృతి, నాగరిక సంబంధాలకు అద్భుతమైన సాక్ష్యంగా నిలవడం విశేషం.

ప్రపంచంలో భారత్ కు ప్రాచీన నాగరికత, సంస్కృతితో కూడిన గొప్ప చరిత్ర, వారసత్వ సంపద కలిగిన దేశంగా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అందుకు నిదర్శనం అన్నట్లుగా తాజాగా థాయ్‌లాండ్‌లో, పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 2,100 సంవత్సరాల నాటి రెండు భారతీయ బంగారు ఉంగరాలను వెలికితీశారు. వాటిలో ఒకటి ప్రాచీన బ్రాహ్మీ లిపిలో చెక్కబడి ఉంది. ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియాతో భారతదేశానికి ఉన్న వర్ధమాన వాణిజ్యం, సంస్కృతి, నాగరిక సంబంధాలకు అద్భుతమైన సాక్ష్యంగా నిలవడం విశేషం.

థాయ్‌లాండ్‌లోని పెట్చబురి ప్రావిన్స్‌లోని డాన్ యాయ్ థాంగ్ ప్రదేశంలో లభించిన రెండు భారతీయ బంగారం ఉంగారాలు సుమారు 2,100 సంవత్సరాల పురాతనమైనవిగా గుర్తించారు. రెండు భారతీయ బంగారు ఉంగరాలను ఇటీవల కనుగొన్నట్లు ఈ పోస్ట్ నివేదిస్తోంది. వాటిలో ఒకదానిపై భారతీయ ప్రాచీన బ్రాహ్మీ లిపిని కలిగి ఉంది. ఆ రెండు ఉంగారాలను ప్రస్తుతం పెట్చబురి మ్యూజియంలో భద్రపరిచారు. తమ దేశంలో భారతీయ ప్రాచీన బంగారు ఉంగరాలను గుర్తించిన విషయాన్ని థాయ్‌లాండ్ లలిత కళల శాఖతో పాటు ఆ దేశ వార్తా సంస్థలు ధృవీకరించాయి.

భారత్ -థాయ్ లాండ్ బంధం ప్రాచీనం

భారతదేశం, థాయ్‌లాండ్‌ల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి. మతం, భాష, సంస్కృతి, వాణిజ్యం ద్వారా ఇవి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి. ప్రాచీన భారతీయ సాహిత్యంలో థాయ్‌లాండ్ ప్రాంతాన్ని సియాన్ (స్వర్ణభూమి) అని వర్ణించారు. భారతదేశం నుండి విస్తరించిన బౌద్ధమతం థాయ్‌లాండ్‌లో ప్రధాన మతంగా మారింది. దీనితో పాటుగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, గణేశుడు వంటి హిందూ దేవతలను కూడా థాయ్‌లాండ్ ప్రజలు నేటికీ పూజిస్తారు. థాయ్ సంస్కృతిపై భారతీయ ఇతిహాసమైన రామాయణం ప్రభావం అధికంగా కనిపిస్తుంది. థాయ్‌లాండ్‌లో రామాయణాన్ని రామకియన్ అని పిలుస్తారు. థాయిలాండ్ రాజులను రామాయణ కథానాయకుడైన రాముడి పేరుతో పిలుస్తుంటారు. భారతీయ ఇతిహాస గాథలు వారి కళలు, నృత్యాలు, దేవాలయాల శిల్పాలలో భాగమయ్యాయి. భారత్ కు అండమాన్ నికోబార్ దీవులతో పాటు థాయ్ లాండ్ సముద్రపు సరిహద్దు దేశంగా కొనసాగుతుంది. పురాతన కాలంలో భారతదేశం నుండి ఆగ్నేయాసియాకు సాగిన సముద్రయాన వాణిజ్యం ద్వారా రెండు దేశాల మధ్య సంస్కృతిక, వాణిజ్య బంధం ప్రారంభమైంది. థాయ్ భాష భారతదేశపు ప్రాచీన భాష అయిన సంస్కృతం, మగధ భాష అయిన పాళీ నుండి ఎన్నో పదాలను స్వీకరించింది. అలాగే థాయ్ లిపి దక్షిణ భారతదేశానికి చెందిన ‘పల్లవ గ్రంథ లిపి’ నుండి అభివృద్ధి చెందింది. చోళ సామ్రాజ్య ప్రభావం థాయిలాండ్ వరకు విస్తరించింది.

థాయిలాండ్‌లోని ప్రాచీన రాజధాని అయోధ్యకు , రాముని జన్మస్థలమైన భారతదేశంలోని అయోధ్య నగరం పేరు పెట్టారు. థాయ్ లాండ్ లో ఉన్న ఈ అయోధ్యను ‘అయుథ్తయ’ అని అంటారు. చారిత్రకంగా, అస్సాంలోని అహోం రాజవంశ స్థాపకులు థాయ్‌లాండ్ ప్రాంతం నుండి వలస వచ్చిన వారేనని డీఎన్ఏ అధ్యయనాలు, చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. థాయ్ నూతన సంవత్సరం సాంగ్‌క్రాన్ ..భారత్ లోని సంక్రాంతి నుండి ఉద్భవించిందని భావిస్తారు. ఇది భారతీయ జ్యోతిష్య సంప్రదాయంలో కనిపించే “సూర్యుని గమనాన్ని” సూచిస్తుంది. 1927లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ థాయ్‌లాండ్‌ను సందర్శించి, రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింతగా బలోపేతం చేశారు. ఏటా లక్షల మంది థాయ్ పర్యాటకులు భారత్ కు, భారత పర్యాటకులు థాయ్ లాండ్ కు వెలుతుంటారు. థాయ్ లాండ్ లో దాదాపు 3లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. రెండు దేశాల మధ్య నేరుగా వీసాల జారీ, స్వేచ్చాయుత వాణిజ్యం కొనసాగుతుంది.

 

Latest News