Youth Heart Attack| షటిల్ ఆడుతునే గుండెపోటుతో పాతికేళ్ల యువకుడి మృతి

Youth Heart Attack| షటిల్ ఆడుతునే గుండెపోటుతో పాతికేళ్ల యువకుడి మృతి

విధాత, హైదరాబాద్ : కరోనా వైరస్ కాలం నుంచి దేశంలో గుండెపోటు(Heart attack) మరణాలు పెరిగిపోతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతు ఆకస్మికంగా ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా హైదరాబాద్ నాగోల్‌(Nagole)లో గుండెపోటుతో యువకుడు(young man)మృతి(died) చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

మిత్రులతో కలిసి షటిల్‌ ఆడుతూ కుప్పకూలిన రాకేష్‌(Rakesh 25) అనే యువకుడు ఆకస్మాత్తుగా ప్రాణాలు(sudden death) విడిచాడు.  నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతు ఒక్కసారిగా కుప్పకూలిన రాకేష్ ను రక్షించేందుకు తోటి మిత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్నేహితులు దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడు గుండ్లు రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడిగా గుర్తించారు. రాకేష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.