BC Reservation Bill | ఢిల్లీకి చేరిన బీసీ రిజర్వేషన్ల పంచాయితీ !

BC Reservation Bill | ఢిల్లీకి చేరిన బీసీ రిజర్వేషన్ల పంచాయితీ !

న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Telangana Congress Government) తీసుకొచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు(42%  BC Reservation Bill), పంచాయితీ ఢిల్లీ(Delhi)కి చేరింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీలు(Congress MP’S)మంగళవారం లోక్ సభలో వాయిదా తీర్మానం(Lok Sabha adjournment motion)ఇచ్చారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై చర్చించాలంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ వాయిదా తీర్మానం అందించారు. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డ్సు పట్టుకుని నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.

మరోవైపు రేపు గురువారం బీసీ రిజర్వేషన్ల సాధనకు జంతర్ మంతర్(Jantar Mantar dharna) వద్ధ ధర్నాకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి జిల్లా నుంచి 25మంది ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగతా మంత్రులు నేడు మంగళవారం ఢిల్లీకి చేరుకుంటారు. రేపు జంతర్ మంతర్ ధర్నా అనంతరం, ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు.