Bengaluru jail liquor party| అది జైలు..కాదు బార్?..వైరల్ గా బెంగుళూర్ జైలు వీడియో!

కర్ణాటక రాజధాని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకొంటున్న వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. వీడియోలో జైల్లోని ఖైదీలు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, మద్యం పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Bengaluru jail liquor party| అది జైలు..కాదు బార్?..వైరల్ గా బెంగుళూర్ జైలు వీడియో!

న్యూఢిల్లీ : అది నిజానికి ఓ జైలు..అందులే ఉండేదంతా ఖైదీలు..కాని వారు మాత్రం మస్తుగా మందేసి చిందేస్తున్నారు. ఇదంతా చూసిన వారికి అది జైలు కాదు..బార్ అన్న సందేహం కలగక మానదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటక రాజధాని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో(Bengaluru jail) ఖైదీలు మద్యం తాగుతూ పార్టీ చేసుకొంటున్న వీడియో(Prison liquor party video) బయటకు రావడం సంచలనంగా మారింది. వీడియోలో జైల్లోని ఖైదీలు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, మద్యం పార్టీ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే ఇదే జైలులో బందీగా ఉన్న ఐసీస్‌ ఖైదీ వీఐపీ సౌకర్యాలు పొందుతున్నట్లు చూపిస్తున్న వీడియో ఇటీవల వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో 2023 నాటిదని అధికారులు పేర్కొన్నారు. మళ్లీ అదే జైలులో ఖైదీల మందు పార్టీ వెలుగులోకి రావడంతో జైలు అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖైదీల మందు పార్టీ వీడియో మాత్రం తాజాగా తీసిందేనని సమాచారం.

విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు

బెంగళూరు జైలుల ఖైదీల మందు పార్టీ సంబరాల వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం, జైళ్ల శాఖ ఖంగుతింది. వెంటనే ఈ ఘటనపై కర్ణాటక డైరెక్టర్ జనరల్, జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ అధికారులు విచారణ చేపట్టారు. మొబైల్ ఫోన్‌లను, మందుబాటిళ్లను ఎవరు లోపలికి తీసుకువచ్చారు.. అవి ఖైదీలకు ఎలా చేరాయి అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వరుసగా బయటకు వస్తున్న వీడియోలను ఎవరు మీడియాకు చేరవేస్తున్నారనే విషయం పైనా కూడా విచారణ జరుగుతుంది. అక్రమాలకు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బెంగుళూరు జైలు మందుపార్టీ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. బెంగళూరు జైలులోని పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.