ఉర్ఫీ జావేద్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎప్పుడూ తన డ్రెస్సింగ్‌తో నిలుస్తూ ఉంటుంది. ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత పలు వివాదాలతో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్స్ నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంటున్నా కూడా ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గనంటుంది. తనకు నచ్చిన పని చేసుకుంటూ వెళుతుంటుంది.ఈ అమ్మడు డిజైన్ చేయించుకొనే డ్రెస్సులు చూస్తే.. అసలు ఇలాంటి ఐడియాలు ఎవరికి వస్తాయిరా బాబు అని అందరు ముక్కున వేలేసుకుంటారు. ఉర్ఫీ ధరించిన వెరైటీ డ్రెస్సులు ఎవరు ధరించి ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
ఆ మధ్య సూర్యుడు చుట్టూ తిరిగే తొమ్మిది గ్రహాలతో కలిపి మొత్తం విశ్వాన్ని తన డ్రెస్సులో పెట్టేసి డిజైన్ చేయించుకొంది. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లో తిరుగుతూ నాన రచ్చ చేసింది. ఇక ఆ తర్వాత సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లో మెరిసిపోయింది. షార్ట్ డ్రెస్సుల్లో నడుము అందాలు చూపిస్తూ.. ఎదపై ఫ్యాన్స్ పెట్టుకొని, వాటికీ బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చి గిర్రుమని తిప్పుతూ క్రేజీ లుక్‌లో కనిపించి రచ్చ చేసింది. ఆ డ్రెస్‌పై నెటిజన్స్ అయితే క్రేజీ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు అయితే బాడీకి టైట్‌గా హత్తుకున్న సిలికాన్ డ్రెస్ లో మెరిసింది. రంజాన్ స్పెషల్ గా ఉర్ఫీ ధరించిన ఈ డ్రెస్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ప్లాస్టిక్ డ్రెస్సా ఉర్ఫీ అని ఫొటోగ్రాఫర్స్ ఆమెని అడగగా, అది సిలికాన్ అని బదులిచ్చింది.
ఈ డ్రెస్‌లో ఉర్ఫీ నడవడానికి కాస్త కష్టంగా కనిపిస్తున్నా కూడా అది క్రేజీగా కనిపిస్తుంది. ఇలాంటి డ్రెస్సులు వేయడం నీకు మాత్రమే సాధ్యం అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అవుట్ ఫిట్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజెన్స్.. సరదా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఉర్ఫీ ధరించే దుస్తులు కేవలం ప్రైవేట్ పార్ట్స్ ని మాత్రమే కవర్ చేసే విధంగా ఉంటాయి. మిగతా శరీరం మొత్తం కనిపించే విధంగా బట్టలను డిజైన్ చేసుకుంటుంది. కొన్ని కొన్ని సార్లు ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపించే విధంగా దుస్తులు వేసుకోవడంతో ఆ సమయంలో ఉర్ఫీని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తుంటారు. కాని ఈ భామ అవన్నీ పట్టించుకోదు.