CM Chandrababu| సురవరం మరణం దేశానికి లోటు: సీఎం చంద్రబాబు

CM Chandrababu| సురవరం మరణం దేశానికి లోటు: సీఎం చంద్రబాబు

విధాత, హైదరాబాద్ : సీపీఐ(CPI) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి(Suravaram Sudhakar Reddy) మరణం సీపీఐ కాకుండా సమాజానికి ..ప్రత్యేకంగా దేశానికి, రాష్ట్రానికి తీవ్ర లోటు అని ఆయన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు.హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌ లో సురవరం పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి(Tributes) అర్పించారు. ఆయన వెళ్లారు. సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నేనంటే సుధాకర్‌రెడ్డికి ప్రత్యేక అభిమానం ఉండేదని.. ఆయనని నేను జీవితంలో ఎప్పుడూ మరచిపోలేననన్నారు.

వ్యక్తిగతంగా నేను చేసే పనులను ఆయన ప్రోత్సహించేవారని, అలాంటి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి చనిపోవడంపై బాధకరమన్నారు. సుధాకర్‌రెడ్డితో తనకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు ఉన్నాయని..గతంలో కలిసి అనే ప్రజాస్వామిక పోరాటాలు చేసినట్లు గుర్తుచేశారు. సురవరం దేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారని తెలిపారు. కేంద్రంలో వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన ఉద్యమాలతో పాటు పలు ఆందోళనల్లో కలిసి పోరాడినట్లు గుర్తు చేసుకున్నారు.