Farmer Finds Diamond| రైతుకు దొరికిన ఖరీదైన వజ్రం

Farmer Finds Diamond : కర్నూల్( Kurnool) జిల్లాలో దిగువ చింతలకొండ(Chintalakonda)లో ఓ రైతు(Farmer )కు తన పొలంలో ఖరీదైన వజ్రం(Diamond) దొరికిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. తనకు దొరికిన వ్రజాన్ని రైతు స్థానికంగా వేలం పెట్టగా..వేలానికి వచ్చిన వ్యాపారులు ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. చివరకు రూ.8లక్షలు ఇస్తామని చెప్పగా..రైతు మాత్రం రూ.18లక్షలు ఇస్తేనే వజ్రం అమ్ముతానని స్పష్టం చేశాడు. దీంతో వ్యాపారులంతా సిండికెట్ గా మారి రూ.8లక్షలకే వజ్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగైతే వజ్రం ఎవరికీ అమ్మేది లేదంటూ రైతు దానిని తన వద్దనే ఉంచుకున్నాడు. ఇటీవలి కాలంలో ఇదే ఖరీదైన వజ్రంగా స్థానికులు చెబుతున్నారు.
వర్షాకాలంలో కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పెరవలి, పగిడిరాయి, కొత్తపల్లి, మద్దికెర, అగ్రహారం, హంప, యడవలి గ్రామాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. అనంతపురం జిల్లాలో తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. వర్షాలు పడగానే కూలీలు, రైతులు, స్థానికులు వజ్రాల వేట సాగిస్తుంటారు. చిన్నదో పెద్దదో దొరికితే తమ దశ తిరుగుతుందన్న ఆశతో పొలాల్లో వజ్రాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు