భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,890 పెరిగి రూ. 1,49,730కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ. 1,37,250 వద్దకు చేరింది. నిన్న రూ.5,000 పెరిగిన కిలో వెండి ధర రూ. ఈ రోజు ఒకేసారి రూ. 10,000 పెరిగి రూ. 2,50,000 మార్క్ కు చేరింది. జూలై 28న రూ.2,35,000వద్ద ఉన్న బంగారం ధర రూ.15,000 పెరుగడం గమనార్హం.

పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,890 పెరిగి రూ. 1,49,730కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ. 1,37,250 వద్దకు చేరింది. నిన్న రూ.5,000 పెరిగిన కిలో వెండి ధర రూ. ఈ రోజు ఒకేసారి రూ. 10,000 పెరిగి రూ. 2,50,000 మార్క్ కు చేరింది. జూలై 28న రూ.2,35,000వద్ద ఉన్న బంగారం ధర రూ.15,000 పెరుగడం గమనార్హం.

పుంజుకుంటున్న బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు భారీగా పుంజుకోవడం, క్రూడ్ ఆయిల్ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, యూఎస్ డాలర్ ఇండెక్స్ కదలికలు నేరుగా భారతీయ బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు డాలర్ ను వదిలేసి బంగారంపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలు.. భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అనుసరించే ఆర్థిక విధానాల పట్ల మదుపరుల్లో వ్యక్తమవుతున్న అంచనాలు పసిడి కొనుగోళ్లకు ఊతమిస్తున్నాయి. ఈ పరిణామాలు అన్ని బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.

రాబోయే పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న కొద్దీ భారత్‌లో పసిడికి భౌతిక డిమాండ్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత ధరల స్థాయిలో కొత్తగా కొనుగోలు చేసే వినియోగదారులు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా.. విడతల వారీగా కొనుగోలు చేయడమో లేదా డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ ల ద్వారా క్రమబద్ధంగా మదుపు చేయడమో సురక్షితమైన విధానమని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరోవైపు పసిడి బాటలోనే పారిశ్రామిక లోహమైన వెండి కూడా మార్కెట్‌లో పరుగులు పెడుతోంది. సోలార్ ప్యానెల్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, వైద్య పరికరాల తయారీ రంగాల నుండి వెండికి భారీగా పారిశ్రామిక డిమాండ్ నెలకొంది. సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాలు, డిమాండ్ పెరుగుదల వల్ల వెండి కిలో ధర దేశీయ మార్కెట్‌లో ఊహించని ఎత్తుకు చేరింది. పరిశ్రమల అవసరాలు ఒకవైపు.. ఇన్వెస్టర్ల పెట్టుబడి కోరికలు మరొకవైపు తోడవడంతో వెండి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

Latest News