NihariKa। నిహారికా.. రచ్చరచ్చ

niharina । మలయాళ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస హిట్లు అందుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న నటుడు షేన్ నిగమ్. ఆయన ఫస్ట్ టైం తమిళంలో హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం మద్రాస్కారన్. మెగా డాటర్ నిహారిక కోణిదెల ఈ మూవీలో కథానాయిక.
గతంలో తమిళంలో రంగోలి చిత్రాన్ని నిర్మించిన వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించగా 2025లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన కాదల్ సడుగుడు అనే పాట యూ ట్యూబ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అందుకు కారణం నిహరిక ఓ రేంజ్లో గ్లామర్ ప్రదర్శించడమే.
పాటలో చివరి వరకు నిక్కర్లోనే కనిపిండంతో పాటు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేసి తనలోని టాలెంట్‌ను బయటపెట్టింది.
అంతేకాదు సాంగ్‌లో రకరకాల భంగిమలు కుర్రకారుకు కిక్ ఇచ్చేలా ఉండడంతో ఈ పాటను కుర్రాళ్లంతా ఎగబడి తిలకిస్తున్నారు. నిహారికలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.