Kaleshwaram-KCR| కాళేశ్వరం నివేదిక ఆధారంగా కొందరు అరెస్ట్ అవొచ్చు: పార్టీ నేతలతో కేసీఆర్

Kaleshwaram-KCR| కాళేశ్వరం నివేదిక ఆధారంగా కొందరు అరెస్ట్ అవొచ్చు: పార్టీ నేతలతో కేసీఆర్

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం(Kaleshwaram) కమిషన్ నివేదిక(Commission Report) పై రాష్ట్ర కేబినెట్ చర్చ నేపథ్యంలో సోమవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)తన ఎర్రవల్లి ఫామ్ హౌస్(Erravalli farmhouse)లో పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం(key meeting)నిర్వహించారు. కాళేశ్వరం నివేదికలో పేర్కొన్న అంశాలు..కాంగ్రెస్ ప్రభుత్వం స్పందన ఎలా ఉండబోతుందన్న అంశాలతో పాటు బీసీ రిజర్వేషన్లు, కవిత అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. దాదాపు ఆరు గంటలుగా కేసీఆర్ వారితో చర్చలు కొనసాగించారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం నుంచి వెలువడే సమాచారం ఆధారంగా మరోసారి చర్చించేందుకు వారంతా అక్కడే ఉన్నారు. భేటీలోహరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్

కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని..కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించిందేనని..దానిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని ధీమా వ్యక్తం చేసినట్లుగా సమాచారం. కొంతమంది బీఆర్ ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు(Arrests Possible) అని..భయపడవద్ధని చెప్పారని తెలుస్తుంది. కాళేశ్వరంపై కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూశాక అధికారికంగా స్పందిద్దామని చెప్పినట్లుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని..కాళేశ్వరంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని..ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ఏంటో తెలంగాణ ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించినట్లుగా పార్టీ వర్గాల కథనం.