Jr NTR Fans Protest| టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటిని ముట్టడించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఉద్రిక్తత

Jr NTR Fans Protest| టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటిని ముట్టడించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఉద్రిక్తత

అమరావతి : జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్(TDP MLA Daggupati Prasad) చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్(Jr NTR Fans Protest) భగ్గుమన్నారు. ఆదివారం అకస్మాత్తుగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం(Anantapur)లోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అడ్డుకుని ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేసి వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే బ్యాచ్ లు బ్యాచ్ లు గా ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ ఇంటి ముట్టడి(క్యాంపు ఆఫీస్ )కి రావడంతో పోలీసులు వారిని నియంత్రించడంలో నానాపాట్లు పడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన ఘటనతో అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత( Tension) నెలకొంది. ఎమ్మెల్యే ప్రసాద్ వెంటనే బహిరంగంగా ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఏపీలో రాజకీయ(Andhra Politics)రంగు పులుముకునే అవకాశముండటంతో టీడీపీ అధిష్టారం ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానుల నిరసనలపై ఎలా స్పందించబోతున్నారన్నదానిపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.