విధాత : ప్రపంచ దేశాలకు ఇంధన సమస్య ఎదుర్కొంటున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌కు డెడ్ లైన్ విధించారు. లేదంటే ఇరాన్ విద్యుత్ ప్లాంట్స్‌ను తుడిచిపెట్టేస్తామని…అన్నిటికంటే పెద్దదైన కేంద్రంతోనే తమ దాడి మొదలుపెడతామని హెచ్చరించారు.
హార్ముజ్ జలసంధి మార్గాన్ని ఎటువంటి బెదిరింపులు లేకుండా.. సంపూర్ణంగా తెరిచేందుకు సరిగ్గా ఇప్పటి నుంచి 48గంటల సమయం ఇస్తున్నాం అని ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన గడువు మార్చి 24 ఉదయం 3 గంటల 14 నిమిషాలతో ముగుస్తుంది. (భారత కాలమానం ప్రకారం మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల14 నిమిషాలు).
ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
హార్ముజ్ జలసంధిని 48గంటల్లో తెరవాలన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ చమురు, విద్యుత్ స్థావరాలపై అమెరికా దాడులు జరిపితే.. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా ఇంధన స్థావరాలను ఇరాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ట్రంప్ తాజా హెచ్చరికల తర్వాత ఇరాన్ ఈ ప్రకటనచేసింది.
