విజయ్ కి దొరికిన మెజార్టీ… గవర్నర్ తో భేటీ

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో విజయ్ కి మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల బలం టీవీకే (107), కాంగ్రెస్‌ (5), సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2), ఐయూఎంఎల్ (2) తో కలిపి మెజార్టీ మార్క్ (118) దాటేసి 120కి చేరింది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు చేసుకుని సాయంత్రం 6:30కు అపాయిట్మెంట్ ఇవ్వడంతో మళ్లీ విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు.

విధాత : తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కి వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో విజయ్ కి మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల బలం టీవీకే (107), కాంగ్రెస్‌ (5), సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2), ఐయూఎంఎల్ (2) తో కలిపి మెజార్టీ మార్క్ (118) దాటేసి 120కి చేరింది. మెజార్టీ సభ్యుల వివరాలతో గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన విజయ్ కి గవర్నర్ అర్లేకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో విజయ్ నాల్గవ సారి గవర్నర్ ను కలిసే ప్రయత్నం ఫలించకపోవడంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.

గవర్నర్ అర్లేకర్ ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉన్నందునా విజయ్ తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని రేపు ఆదివారం లోక్ భవన్ కార్యాలయంలో సమర్పించాలని ఫోన్ ద్వారా తెలియచేశారు. ఆ తర్వాతా  కొద్ది సేపటికే గవర్నర్ కేరళ పర్యటన రద్దు చేసుకుని సాయంత్రం 6:30కు అపాయిట్మెంట్ ఇవ్వడంతో మళ్లీ విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ విజయ్ సమర్పించే మద్దతు వివరాలను పరిశీలించి సంతృప్తి చెందితే సోమవారం విజయ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం.

అటు విజయ్ కి వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు బేషరతుగా మద్దతునిస్తూ లేఖలు అందించాయి. అయితే లోపాయికారిగా పలు షరతులు పెట్టినట్లుగా తెలుస్తుంది.

అన్నాడీఎంకే లో చీలిక …?

మరోవైపు అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో శనివారం జరిగిన పార్టీ సమావేశానికి పలువురు సీనియర్లు గైర్హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. సీనియర్ నేతలు షణ్ముగం, లీన్ రోజ్, విజయ భాస్కర్ లతో సహా మరికొందరు
టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.

Latest News