చెట్లను నరకొద్దు..కౌగిలించుకుని మహిళ కన్నీటి ధార!

తమిళనాడులోని కల్లకురిచిలో హై-టెన్షన్ విద్యుత్ లైన్ ప్రాజెక్ట్ కోసం చెట్లను నరికివేస్తుండగా, ఒక మహిళ తను పెంచిన చెట్లను గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ..అధికారులను అడ్డుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.

విధాత: ప్రకృతితో ముఖ్యంగా అడవితో ఆదివాసీలు, గిరిజనులు, గ్రామీణులు పెంచుకునే బంధం ప్రత్యేకమైంది. అలాగే రైతాంగం..గ్రామీణ ప్రజలు కూడా తాము పెంచుకునే పశు పక్ష్యాదులు, చెట్లపై అంతే ప్రేమను ప్రదర్శిస్తుంటారు. అవి వారికి దూరమవుతాయని తెలిసినప్పుడు వారు తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా తమిళనాడులోని కల్లకురిచిలో హై-టెన్షన్ విద్యుత్ లైన్ ప్రాజెక్ట్ కోసం చెట్లను నరికివేస్తుండగా, ఒక మహిళ తను పెంచిన చెట్లను గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ..అధికారులను అడ్డుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.

కల్లకురిచిలో హై టెన్షన్ విద్యుత్ లైన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భారీగా చెట్ల నరికివేత చేపట్టారు. నరికివేయబడిన చెట్ల నుండి కారే జిగురు మరకలు స్థానికులకు ఆ చెట్ల కన్నీళ్లుగా భావించేంతంగా ఆ చెట్లతో వారు అనుబంధాన్ని పెంచుకున్నారు. దేళ్లపాటు ఎంతో ఆశతో, మక్కువతో పెంచిన చెట్లు కళ్ల ముందే నరికివేయబడుతుంటే, ఒక మహిళ కన్నీళ్లతో ఆ చెట్లను గట్టిగా కౌగిలించుకుంటోంది.ఆ చెట్లను తాము 10 సంవత్సరాలుగా ఎంతో ప్రేమగా పెంచామని ఆమె వాపోయింది.

చెట్ల నరికివేతకు వచ్చిన అధికారులను అడ్డుకుని చెట్టును గట్టిగా పట్టుకుని ఏడుస్తున్న మహిళను మహిళా పోలీస్ సిబ్బంది బలవంతంగా దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా నరికిన చెట్ల మొద్దుల మధ్య కూర్చొని ఆ మహిళ రోధించసాగింది. మహిళా పోలీసు సిబ్బంది కూడా చెట్ల నరికివేతపై ఆ మహిళ పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకుని ఓదార్చారు. మౌలిక వసతుల అభివృద్దికి ఒక్కోసారి ఇలాంటి తప్పవంటవు అనునయించారు.

 

Latest News