ఆ జిల్లా జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ

విధాత: ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ కావడం ఏంటి? ఒంటరిగా ఉంటున్న ఖైదీలకు హెచ్‌ఐవీ సోకడం ఏంటని అనుకుంటున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఆ జిల్లా జైల్లో ఒకరిద్దరికి కాదు.. ఏకంగా 140 మంది ఖైదీలు ఎయిడ్స్ బారిన పడ్డారు. మరి ఆ జైలు ఏదో, ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌ తప్పక వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని డాసనా జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 2016లో యూపీ జైళ్లల్లో […]

  • Publish Date - November 19, 2022 / 02:40 AM IST

విధాత: ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ కావడం ఏంటి? ఒంటరిగా ఉంటున్న ఖైదీలకు హెచ్‌ఐవీ సోకడం ఏంటని అనుకుంటున్నారా? మీరు చదువుతున్నది నిజమే. ఆ జిల్లా జైల్లో ఒకరిద్దరికి కాదు.. ఏకంగా 140 మంది ఖైదీలు ఎయిడ్స్ బారిన పడ్డారు. మరి ఆ జైలు ఏదో, ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌ తప్పక వెళ్లాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని డాసనా జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 2016లో యూపీ జైళ్లల్లో హెచ్ఐవీ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించగా ఆ సమయంలో 49 మందికి ఎయిడ్స్ నిర్ధారణ అయినట్లు తేలింది.

ఇక అప్పట్నుంచి సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా హెచ్ఐవీ, టీబీ వంటి టెస్టులను తప్పనిసరిగా చేస్తు హెచ్ఐవీ నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జైలుకు నిందితులను తరలించే ముందు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు ఇంత మంది ఎయిడ్స్ బారిన పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇదిలాఉండగా ఘాజియాబాద్ జైలు సామర్థ్యం 1706 మంది ఖైదీలకు సరిపోయే విధంగా ఉండగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 5500 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 140 మందికి ఎయిడ్స్, 35 మంది టీబీతో బాధ పడుతున్నట్లు తేలింది.