తమిళనాడులో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక
లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రాల్లో తన బలాన్నిచాటుకోవాలని చూస్తున్న బీజేపీకి జాక్‌పాట్ తగిలింది

- మాజీ ఎంపీ కూడా కాషాయగూటికి
- వీరంతా బీజేపీ మిత్రపక్షమైన
- అన్నాడీఎంకేకు చెందినవారే
విధాత: లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రాల్లో తన బలాన్నిచాటుకోవాలని చూస్తున్న బీజేపీకి జాక్‌పాట్ తగిలింది. తమిళనాడుకు చెందిన 15 మంది మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీ ఒకరు ఢిల్లీలో బీజేపీలో చేరారు. వీరిలో ఎక్కువ మంది రాష్ట్రంలో గతంలో బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకేకు చెందినవారే కావడం విశేషం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై, కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్ మురుగన్ సమక్షంలో బుధవారం ఉదయం ఢిల్లీలో ఈ చేరికలు జరిగాయి.
పార్టీ కండువాలు కప్పివారిని అన్నామలై స్వాగతించారు. తాము భాజపాకు అనుభవ సంపదను తీసుకొచ్చామని, నేరుగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. “తమిళనాడు భారతీయ జనతా పార్టీ మార్గంలో వెళుతోంది,” అని యువ నాయకుడు పేర్కొన్నాడు. రాబోయే లోక్‌సభలో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని, ఎన్డీఏ 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని మోదీ అంచనా వేస్తున్నారని, వీటిలో చాలా కొత్త సీట్లు తమిళనాడు నుంచి వస్తాయని పేర్కొన్నారు.