విధాత: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మామూలు హీరోగా, మాస్, యాక్షన్… ఇలా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఉపయోగపడే విధంగా మారడానికి తీసిన చిత్రమే ‘షంషేరా’. ఆయన తన సినిమాల ఎంపిక విధానం మార్చుకుని మరింత మంది అభిమానులకు చేరువ అవ్వాలని భావించి.. తన రెగ్యులర్ అభిమానులను కూడా సంతృప్తి పరచలేకపోతున్నాడు. దీంతో రెంటికి చెడ్డ రేవడిగా మారాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో ఇప్పటివరకు రణబీర్ […]
విధాత: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మామూలు హీరోగా, మాస్, యాక్షన్… ఇలా అన్ని రకాల పాత్రలు చేయడానికి ఉపయోగపడే విధంగా మారడానికి తీసిన చిత్రమే ‘షంషేరా’. ఆయన తన సినిమాల ఎంపిక విధానం మార్చుకుని మరింత మంది అభిమానులకు చేరువ అవ్వాలని భావించి.. తన రెగ్యులర్ అభిమానులను కూడా సంతృప్తి పరచలేకపోతున్నాడు. దీంతో రెంటికి చెడ్డ రేవడిగా మారాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక బాలీవుడ్ లో ఇప్పటివరకు రణబీర్ కపూర్ ఆలియా భట్లే బెస్ట్ రొమాంటిక్ కపుల్. వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ జంటకు ఒక పాప కూడా పుట్టింది. జూలైలో విడుదలైన ‘షంషేరా’ మూవీ మాత్రం రణబీర్ కపూర్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్. ఈ సినిమా ఇంత పెద్ద ఫ్లాప్ కావడానికి గల కారణాన్ని రణబీర్ కపూర్ స్వయంగా వెల్లడించాడు. జూలై 22న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. షంషేరా మూవీ డిజాస్టర్ కావడానికి మేం చేసిన పొరపాట్లే ప్రధాన కారణం. అందులో నా గడ్డం కూడా మొదటిది. నేను ఈ చిత్రం కోసం కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ గడ్డం పెట్టుకున్నాను.
ఎండలో షూటింగ్ చేసే సమయంలో అది సరిగా కనిపించేది కాదు. ముఖానికి అతుక్కుని పోయినట్లు కనిపించింది. మేము దాన్ని కనిపెట్టలేకపోయాం. అందుకే ఈ సినిమా అంత పెద్ద ఫ్లాఫ్ అయిందని అనుకుంటున్నానని తెలిపాడు.
ఈ సినిమా వైఫల్యానికి రణబీర్ గడ్డమే కారణమని అక్షయ్ కుమార్ కూడా ఒప్పుకుంటూ రణబీర్ చెప్పిన గడ్డం ఎఫెక్ట్‌కు పాస్ మార్కులు ఇచ్చాడు. అదే నిజమై ఉంటుందని కూడా ఓపెన్‌గా చెప్పేశాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాగా ‘షంషేరా’ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయారు. దాదాపు 150 కోట్ల వరకు ఈ సినిమా నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అందుకే, అతుకుడు గడ్డంతో 150 కోట్లు పోగొట్టిన చిత్రంగా ‘షంషేరా’ని చెప్పుకోవాలి.