Rajasthan | ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో కంటి ఆప‌రేష‌న్లు.. చూపు కోల్పోయిన 18 మంది

Rajasthan విధాత‌: రాజ‌స్థాన్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యుల నిర్ల‌క్ష్యం బ‌య‌ట‌ప‌డింది. సవాయి మాన్ సింగ్ హాస్పిట‌ల్‌లో కంటి ఆప‌రేష‌న్లు చేయించుకున్న వారిలో 18 మంది త‌మ కంటి చూపును కోల్పోయారు. బాధితులంతా కాట‌రాక్ట్ స‌ర్జ‌రీలు చేయించుకున్న‌ట్లు తేలింది. వారంతా కంటి నొప్పితో బాధ‌ప‌డుతూ మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేర‌గా, వారికి తిరిగి ఆప‌రేష‌న్లు చేశామ‌ని వైద్యులు తెలిపారు. కానీ వీరిలో కొంద‌రికి మాత్ర‌మే చూపు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా బాధిత వ్య‌క్తి మాట్లాడుతూ.. త‌న‌కు జూన్ 23వ తేదీన […]

  • Publish Date - July 12, 2023 / 01:37 PM IST

Rajasthan

విధాత‌: రాజ‌స్థాన్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యుల నిర్ల‌క్ష్యం బ‌య‌ట‌ప‌డింది. సవాయి మాన్ సింగ్ హాస్పిట‌ల్‌లో కంటి ఆప‌రేష‌న్లు చేయించుకున్న వారిలో 18 మంది త‌మ కంటి చూపును కోల్పోయారు. బాధితులంతా కాట‌రాక్ట్ స‌ర్జ‌రీలు చేయించుకున్న‌ట్లు తేలింది. వారంతా కంటి నొప్పితో బాధ‌ప‌డుతూ మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేర‌గా, వారికి తిరిగి ఆప‌రేష‌న్లు చేశామ‌ని వైద్యులు తెలిపారు. కానీ వీరిలో కొంద‌రికి మాత్ర‌మే చూపు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా బాధిత వ్య‌క్తి మాట్లాడుతూ.. త‌న‌కు జూన్ 23వ తేదీన కంటి ఆప‌రేష‌న్ చేశారు. జులై 5వ తేదీ వ‌ర‌కు కంటి చూపు బాగానే ఉంది. ప్ర‌తిదీ క‌నిపించేది. కానీ జులై 6 – 7 తేదీల మ‌ధ్య‌లో చూపును కోల్పోయాను. దీంతో ఆస్ప‌త్రికి రాగా, మ‌ళ్లీ స‌ర్జ‌రీ చేశారు. అయిన‌ప్ప‌టికీ కంటి చూపు రాలేదు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇన్ఫెక్ష‌న్ అని వైద్యులు చెప్పారు. కంటి చూపు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని వైద్యులు చెప్పిన‌ట్లు అత‌ను తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ఆప్తాల్మాలజీ విభాగం వైద్యులు స్పందించారు. త‌మ వైపు నుంచి ఎలాంటి లోపం లేద‌ని పేర్కొన్నారు. దీనిపై ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.