Mexico | మెక్సికోలో ఘోర ప్ర‌మాదం.. 18 మంది ప్ర‌యాణికులు మృతి

Mexico | మెక్సికోలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి, రోడ్డు ప‌క్క‌నే ఉన్న లోయ‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో 18 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న గురువారం ఉద‌యం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 42 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స్థానిక పోలీసులు, అధికారులు తెలిపారు. 20 మంది ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రులంద‌రినీ చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న‌వారిలో ఓ […]

Mexico | మెక్సికోలో ఘోర ప్ర‌మాదం.. 18 మంది ప్ర‌యాణికులు మృతి

Mexico | మెక్సికోలో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి, రోడ్డు ప‌క్క‌నే ఉన్న లోయ‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో 18 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న గురువారం ఉద‌యం చోటు చేసుకుంది.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 42 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స్థానిక పోలీసులు, అధికారులు తెలిపారు. 20 మంది ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రులంద‌రినీ చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న‌వారిలో ఓ మ‌హిళ ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

ప్ర‌యాణికుల్లో చాలా మంది ఇండియ‌న్స్, ఆఫ్రిక‌న్ దేశ‌స్తులు ఉన్నార‌ని పేర్కొన్నారు. అతి వేగం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు. బ‌స్సు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల‌ను గుర్తించే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు.