Supermoon | నేడు ఆకాశంలో అద్భుతం.. 2023లో తొలి సూపర్‌మూన్

Supermoon విధాత‌: ఈ రాత్రి ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనున్న‌ది. ఈ సంవత్సరంలో మొదటి సూపర్‌మూన్ సోమ‌వారం (జూలై 3న) రాత్రి ఆకాశంలో క‌నువిందు చేయ‌నున్న‌ది. చంద్రుడు భూమి నుంచి సగటు దూరం 382,900 కిలోమీట‌ర్లతో పోలిస్తే ద‌గ్గ‌ర‌గా క‌నిపిస్తాడు. సాధారణ పౌర్ణమితో పోలిస్తే ఇది భూమికి 22,530 కిలోమీటర్ల దగ్గరగా ఉండటం మరింత ప్రత్యేకం. దాంతో ఈ రోజు రాత్రి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. జూలై సూపర్‌మూన్‌ను బక్ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే మగ జింకల […]

  • Publish Date - July 3, 2023 / 12:01 PM IST

Supermoon

విధాత‌: ఈ రాత్రి ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనున్న‌ది. ఈ సంవత్సరంలో మొదటి సూపర్‌మూన్ సోమ‌వారం (జూలై 3న) రాత్రి ఆకాశంలో క‌నువిందు చేయ‌నున్న‌ది. చంద్రుడు భూమి నుంచి సగటు దూరం 382,900 కిలోమీట‌ర్లతో పోలిస్తే ద‌గ్గ‌ర‌గా క‌నిపిస్తాడు.

సాధారణ పౌర్ణమితో పోలిస్తే ఇది భూమికి 22,530 కిలోమీటర్ల దగ్గరగా ఉండటం మరింత ప్రత్యేకం. దాంతో ఈ రోజు రాత్రి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. జూలై సూపర్‌మూన్‌ను బక్ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే మగ జింకల కొమ్ములు సాధారణంగా ఈ టిమ్ చుట్టూ పెరుగుతాయి.

ఈ ఏడాది నాలుగు సూప‌ర్ మూన్‌లు

ఈ ఏడాది నాలుగు సూపర్‌మూన్‌లు క‌నువిందు చేయ‌నున్నాయి. ఈ సాధార‌ణంగా ఏడాదికి 12 పౌర్ణ‌ములు వ‌స్తాయి. కానీ, ఈ ఏడాది 13 పౌర్ణ‌ములు రానున్నాయి. సోమవారం సాయంత్రం 5:09 కు చంద్రుడు ప్ర‌కాశవంతంగా క‌నిపిస్తాడు. నేడు తొలి సూప‌ర్ మూన్‌, ఆగస్టులో రెండు సూపర్‌మూన్‌లు క‌నిపిస్తాయి. నాలుగో సూపర్ మూన్ సెప్టెంబర్ 29న రాత్రి ఆకాశంలో క‌నువిందు చేయ‌నున్న‌ది