24 గంటల్లోపే 3 శక్తివంతమైన భూంకపాలు.. 3,600 మంది మృతి
Turkey Earthquake | టర్కీ, సిరియాను భూకంపం కుదిపేసింది. 24 గంటల వ్యవధిలోనే మూడు శక్తివంతమైన భూకంపాలు సంభవించడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 3,600 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,340 మందిని ప్రాణాలతో కాపాడారు. 13,293 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల్లో వేల సంఖ్యలో జనాలు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క టర్కీలోనే 5,606 భవనాలు కుప్పకూలాయి. సిరియాలోనూ డజన్ల […]

Turkey Earthquake | టర్కీ, సిరియాను భూకంపం కుదిపేసింది. 24 గంటల వ్యవధిలోనే మూడు శక్తివంతమైన భూకంపాలు సంభవించడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 3,600 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,340 మందిని ప్రాణాలతో కాపాడారు. 13,293 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల్లో వేల సంఖ్యలో జనాలు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క టర్కీలోనే 5,606 భవనాలు కుప్పకూలాయి. సిరియాలోనూ డజన్ల కొద్ది బిల్డింగ్‌లు నేలమట్టం అయ్యాయి. అలెప్పోలో ఆర్కియాలజీ సైట్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
మొదటి భూకంపం సోమవారం తెల్లవారుజామున టర్కీలో సంభవించగా, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.8గా నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండో సారి భూకంపం సంభవించింది. అప్పుడు భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. సాయంత్రం 6 గంటల సమయంలో 6.0 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ఇంకా వందల కొద్ది భూప్రకంపనలు సిరియా, టర్కీని కుదిపేసే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్షతగాత్రులతో టర్కీ, సిరియాలో ఆస్పత్రులు నిండిపోయాయి. వారి హాహాకారాలతో పరిస్థితులు దయనీయంగా మారాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశారు. అధికారులు శిథిలాలను తొలగిస్తూ.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూనే ఉన్నారు. భూకంప ధాటికి జనాలు బిక్కుబిక్కుమంటూ రోడ్లపై గడుపుతున్నారు.