విధాత: ఆన్‌లైన్ రమ్మీ ఆడి నష్టపోయిన ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నామక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నామక్కల్‌లోని ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు నాగరాజ్ ఐదు రోజుల క్రితం బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమని అందరూ భావించగా, పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నాగరాజు కొంత కాలంగా ఆన్‌లైన్ రమ్మీ ఆడేవాడని, అలాగే మూడు నంబర్ల లాటరీలు ఆడి మొత్తం రూ.30 లక్షల వరకు నష్టపోయాడు. ఈ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని విచారణలో తెలిసింది.