Singareni: సింగరేణి రికార్డు.. చరిత్రలోనే అత్యధికంగా రూ.32,830 కోట్ల టర్నోవర్

Singareni తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏడాది టర్నోవర్‌తో పోల్చితే 174 శాతం వృద్ధి చైర్మన్ & ఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడి విధాత‌: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్ పై 23 శాతం వృద్ధిని నమోదు అయిందని సింగరేణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ […]

Singareni: సింగరేణి రికార్డు.. చరిత్రలోనే అత్యధికంగా రూ.32,830 కోట్ల టర్నోవర్

Singareni

  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏడాది టర్నోవర్‌తో పోల్చితే 174 శాతం వృద్ధి
  • చైర్మన్ & ఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడి

విధాత‌: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్ పై 23 శాతం వృద్ధిని నమోదు అయిందని సింగరేణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి సంజీవరెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు (2013-14)లో సింగరేణి సాధించిన 12,000 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ఇది 173 శాతం అధికం అని , తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనం అని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖరరావు దిశా నిర్దేశంలో సంస్థ చైర్మన్& ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో 10 కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు.

ప్రతీ ఏడాది ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ, వాటిని సాధించడమే కాక చక్కటి వ్యాపార వ్యూహంతో బొగ్గు అమ్మకాలను 8 రాష్ట్రాలకు విస్తరించడంతో టర్నోవర్ గణనీయంగా పెరిగిందని తెలిపారు. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో ఇంత భారీ టర్నోవర్ వృద్ధిని సాధించిన సంస్థ సింగరేణే కావడం విశేషమని అన్నారు.

బొగ్గు అమ్మకాలలో 25 శాతం… విద్యుత్ అమ్మకాలలో 13 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. సింగరేణి సంస్థ 2022-23 లో సాధించిన ఈ టర్నోవర్ లో బొగ్గు అమ్మకాల ద్వారా 28459 కోట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకం ద్వారా 4371 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం కూడా ఆల్టైం రికార్డుగా ఉందని పేర్కొన్నారు.

అంతకు ముందు ఏడాది(2021-22) సాధించిన 22740 కోట్ల రూపాయల బొగ్గు అమ్మకాలతో పోల్చితే సింగరేణి ప్రస్తుతం 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే విద్యుత్ అమ్మకాల్లో 2021-22లో జరిపిన 3879 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ప్రస్తుతం 13 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి మొత్తమ్మీద 2021-22 కన్నా 23 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ 2022-23 లో నమోదు చేసి సరికొత్త రికార్డును లిఖించిందని ఆనందం వ్య‌క్తం చేశారు.

రానున్న మూడేళ్ల లో 50 వేల కోట్ల టర్నోవర్..

ఈ ఆర్థిక సంవత్సరం 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో 80 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సింగరేణి చేరుకోనున్నదని, అలాగే మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. కావున 2026-27 నాటికి 50 వేల కోట్ల టర్నోవర్ మైలురాయిని సింగరేణి చేరుకుంటుందని, ఇందుకు అన్ని సానుకూలతలు ఉన్నాయని సంస్థ ఛైర్మన్ తెలిపారు.

కార్యక్రమంలో M.శ్రీనివాస్, వి.పురుషోత్తమ రెడ్డి ప్రాజెక్ట్ ఆఫీసర్లు, మురళీధర్ ఏజిఎం ఫైనాన్స్, ఏవీ రెడ్డి ఏజెంట్ RK 5 & 6 గ్రూప్, చిరంజీవులుDGM IED, శ్రీనివాస్ ఐటీ సీనియర్ ప్రోగ్రామర్ పాల్గొన్నారు.