అక్టోబర్ రెండో వారంలో వినోదాల విందు… ఏకంగా ఎన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయంటే..

ప్రతి వారం ఓటీటీలో వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకులని పలకరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు సినిమాలు మరోవైపు వైబ్ సిరీస్‌లు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. అక్టోబర్ తొలి వారం దాదాపు 35 సినిమాలు సందడి చేయగా, ఇప్పుడు రెండో వారం కూడా 35 సినిమాలు ప్రేక్షకులని పలకరించనున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మథగమ్ పార్ట్ 2 (వెబ్ సిరీస్)- అక్టోబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుండగా, సుల్తాన్ ఆఫ్ దిల్లీ (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 13న, గూస్‌బంప్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 13 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ లో మార్గాక్స్ (హాలీవుడ్ మూవీ)- అక్టోబర్ 9 నుండి స్ట్రీమింగ్ అవుతుండగా, డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 (ఇటాలియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10, లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్)- అక్టోబర్ 10, బిగ్ వేప్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్)- అక్టోబర్ 11, వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ సినిమా)- అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న మరి కొన్ని సినిమాలు చూస్తే .. ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్)- అక్టోబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుండగా, గుడ్‌నైట్ వరల్డ్ జపనీస్ (వెబ్ సిరీస్)- అక్టోబర్ 12 నుండి, ది ఫాల్ ఆఫ్ ది హౌజ్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 12 నుండి, ఇజగ్బాన్ (యోరుబా సినిమా)- అక్టోబర్ 13 నుండి, కాసర్ గోల్డ్ (మలయాళ చిత్రం)- అక్టోబర్ 13 నుండి, ది కాన్ఫరెన్స్ (స్వీడిష్ సినిమా)- అక్టోబర్ 13 నుండి, క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్ మూవీ)- అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూస్తే.. అవేర్‌నెస్ (స్పానిష్ చిత్రం)- అక్టోబర్ 11 నుండి, ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ చిత్రం)- అక్టోబర్ 12 నుండి, ఎవ్రీబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్ సిరీస్)- అక్టోబర్ 13 నుండి, ది బరియల్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 13 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇక జియో సినిమాలో కోఫుకు (హిందీ షార్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 9, అర్మాండ్ (హిందీ షార్ట్ మూవీ)- అక్టోబర్ 9 నుండి స్ట్రీమ్ అవుతున్నాయి. కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైమ్ మేషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 11 నుండి, ది లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 12 నుండి, మురాఖ్ ది ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 13 నుండి, రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక బుక్ మై షోలో మిషన్ ఇంపాజిబుల్- డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 11 నుండి, టాక్ టూ మీ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 15 నుండి, ది క్వీన్ మేరీ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 15 నుండి, స్టార్ వర్సెస్ ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్)- డిస్కవరీ ప్లస్- అక్టోబర్ 9 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక మట్టికథ (తెలుగు మూవీ)- ఆహా- అక్టోబర్ 13న, ప్రేమ విమానం (తెలుగు చిత్రం)- జీ5- అక్టోబర్ 13న, మిస్టర్ నాగభూషణం (తెలుగు వెబ్ సిరీస్)- అక్టోబర్ 13 నుండి, సంతిత్ క్రాంతి సీజన్ 2 (మరాఠీ వెబ్ సిరీస్)- సోనీ లివ్- అక్టోబర్ 13 నుండి, లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 13 నుండి, పాస్ట్ లైవ్స్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 13 నుండి స్ట్రీమ్ కాబోతున్నాయి. ఇలా ఈవారం ఏకంగా 35 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి.