విధాత: చేతన్ శర్మసహా నలుగురు సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీని నుంచి బీసీసీఐ తొలిగించింది. కొత్త సెలెక్టర్ల కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతోపాటు గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ కూడా చేరలేక పోయినా భారత జట్టును ఎంపిక చేసింది ఈ సెలక్షన్ కమిటీనే అన్న సంగతి తెలిసిందే.
ఈ కమిటీలో చేతన్ శర్మతో పాటు హర్విందర్‌సింగ్, సునిల్ జోషి, దేబశిష్ మొహంతి ఉన్నారు. కొత్త సెలక్షన్ కమిటీ కోసం ఈ నె28లోగా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన నేపథ్యంలో త్వరలో జట్టులో భారీ మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సెలక్షన్ కమిటీపై వేటు ఇదే విషయాన్ని సూచిస్తున్నది.