టీఎస్పీఎస్సీకి 40 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించేందుకు వీలుగా టీఎస్పీఎస్సీకి 40 కోట్ల నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.

  • Publish Date - February 7, 2024 / 12:27 PM IST

విధాత, హైదరాబాద్‌ : ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించేందుకు వీలుగా టీఎస్పీఎస్సీకి 40 కోట్ల నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీతో నిరుద్యోగుల ఇబ్బందులకు కారణమైన టీఎస్పీఎస్సీ బోర్డును సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేసి పాత సభ్యులను పూర్తిగా తొలగించి, కొత్త చైర్మన్‌ను, సభ్యులను నియమించింది. కొత్త చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించిన ప్రభుత్వం ఇప్పుడు 40కోట్ల నిధులు విడుదల చేసి బోర్డు సక్రమ నిర్వాహణ, ఉద్యోగ నోటిఫికేషన్ల కసరత్తుకు మద్దతునందించింది. టీఎస్పీఎస్సీలో వరుసగా చోటుచేసుకుంటున్న మార్పులతో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతాయన్న భరోసా నిరుద్యోగుల్లో ఏర్పడుతుంది.