నాలుగో తరగతి విద్యార్థిని కొట్టి చంపిన టీచర్.. తల్లిపై కూడా దాడి
విధాత: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కొట్టి చంపాడు. తన కుమారుడిపై దాడిని అడ్డుకోబోయిన తల్లిపై కూడా ఆ టీచర్ దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గడక్ జిల్లా హగ్లీ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో భరత్ అనే విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే ఉపాధ్యాయుడు ముత్తప్ప హడగలి.. ఎలాంటి […]

విధాత: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కొట్టి చంపాడు. తన కుమారుడిపై దాడిని అడ్డుకోబోయిన తల్లిపై కూడా ఆ టీచర్ దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గడక్ జిల్లా హగ్లీ గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో భరత్ అనే విద్యార్థి నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే ఉపాధ్యాయుడు ముత్తప్ప హడగలి.. ఎలాంటి కారణం లేకుండానే భరత్‌ను తీవ్రంగా కొట్టాడు. అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న భరత్ తల్లి గీతా బార్కర్.. ముత్తప్పను అడ్డుకోబోయింది. ఆమెపై కూడా దాడి చేశాడు ముత్తప్ప.
తల్లీకుమారుడిపై దాడిని గమనించిన మరో టీచర్ నంగన్ గౌడ కూడా ముత్తప్పను అడ్డుకోబోయాడు. అయినప్పటికీ ఆ టీచర్ ఆగిపోలేదు. నంగన్ గౌడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాలుడు భరత్‌ను మొదటి అంతస్తు నుంచి తోసేయగా, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ టీచర్లు గీతా బార్కర్, నంగన్ గౌడను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.