Manchiryala: ఈనెల 14న సత్యాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేయండి: MLA శ్రీధర్ బాబు, MLC జీవన్ రెడ్డి

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విధాత : ఆదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో నిర్వహించనున్న సత్యాగ్రహ సభా ప్రాంగణం ఏర్పాట్లను ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాలకు చేరుకున్నది. […]

  • Publish Date - April 11, 2023 / 04:55 AM IST
  • ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

విధాత : ఆదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో నిర్వహించనున్న సత్యాగ్రహ సభా ప్రాంగణం ఏర్పాట్లను ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాలకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

దేశ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్న ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ పట్ల బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆదాని ఆస్తులపై జేఏసీ వేయాలని కోరిన రాహుల్ గాంధీని సభలో లేకుండా చేసే కుట్రలో భాగమే ఈ అనర్హత వేటు అని పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాగిస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి మద్దతుగా నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నట్లు వెల్లడించారు.

భట్టి పాదయాత్ర చేసిన గ్రామాలను పరిశీలిస్తే ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించిందన్నారు. పోడు భూముల సమస్య, సింగరేణి ప్రైవేటీకరణ, ప్రాణహిత ప్రాజెక్టును చంపేయడంతో బీడు భూములుగా మారిన పంట పొలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుతో నీట మునుగుతున్న పంట పొలాలు ఇలా అనేక సమస్యలు వెలుగు చూశాయన్నారు.

బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. మోడీ కెసిఆర్ లు ఇస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు చాటి చెప్పడానికి నిర్వహించే బహిరంగ సభకు సుమారు లక్ష మందిని సమీకరిస్తున్నట్లు చెప్పారు. లక్ష మంది హాజరయ్యే ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ బహిరంగ సభను కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

వారి వెంట‌ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పిసిసి వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, పీసీసీ జనరల్ సెక్రెటరీ నెమిండ్ల శ్రీనివాస్, భూపాలపల్లి డిసిసి అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, జగిత్యాల డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, హనుమకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జి, లోకేష్ యాదవ్, టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్, పిసిసి సెక్రెటరీ కొత్త కురుమ శివకుమార్, బుల్లెట్ బాబు, వైరా నియోజకవర్గ నాయకులు బానోతు బాలాజీ నాయక్ తదితరులు ఉన్నారు.