Hexagonal Diamond | ఎన్టీఆర్ జిల్లాలో వజ్రాల వేట.. అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రజలు ఏపీలో పారుతున్న కృష్ణా నది వెంబడి వజ్రాలు దొరుకుతాయని చరిత్రలో చదువుకున్నదే.. ఈ కాలంలో కూడా అదృష్టవంతులకు వజ్రాలు దొరికినట్లు, వారు కోటీశ్వరులైనట్లు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా గుంటూరుకు చెందిన ఓ కుటుంబానికి అరుదైన షట్భుజ వజ్రం దొరికిందనే వార్త బాగా ప్రచారం కావడంతో .. చుట్టుపక్కల వారందరూ పొలాల వెంట, మట్టి దిబ్బల వెంట వజ్రాల వేట ప్రారంభించారు. […]
Hexagonal Diamond |
ఏపీలో పారుతున్న కృష్ణా నది వెంబడి వజ్రాలు దొరుకుతాయని చరిత్రలో చదువుకున్నదే.. ఈ కాలంలో కూడా అదృష్టవంతులకు వజ్రాలు దొరికినట్లు, వారు కోటీశ్వరులైనట్లు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
తాజాగా గుంటూరుకు చెందిన ఓ కుటుంబానికి అరుదైన షట్భుజ వజ్రం దొరికిందనే వార్త బాగా ప్రచారం కావడంతో .. చుట్టుపక్కల వారందరూ పొలాల వెంట, మట్టి దిబ్బల వెంట వజ్రాల వేట ప్రారంభించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని గుడిమెట్ల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వజ్రాలు వెతుకుతున్నారు. మహిళలు, పురుషులు, పెద్దా చిన్నా అందరూ భారీ గోతులు తీసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అయితే ఆ మట్టి పెళ్లలు విరిగి పడితే ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంటుంది. ఖ్యాతి గాంచిన గోల్కొండ వజ్రాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐడల్స్ ఐ వజ్రం లాంటివి చరిత్రకే పరిమితమో.. అంతకు మించినవి దొరుకుతాయో చూడాలి మరి.