Tragedy in Habsiguda: హబ్సిగూడలో తీవ్ర విషాదం.. ఇద్ధరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్ హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనైన చంద్రశేఖర్ రెడ్డి దంపతులు తమ ఇద్ధరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాధ ఘటన చోటుచేసుకుంది.

  • By: Somu    latest    Mar 11, 2025 11:03 AM IST
Tragedy in Habsiguda: హబ్సిగూడలో తీవ్ర విషాదం.. ఇద్ధరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

Tragedy in Habsiguda: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. హైదరాబాద్ హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనైన చంద్రశేఖర్ రెడ్డి దంపతులు తమ ఇద్ధరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాధ ఘటన చోటుచేసుకుంది.
మృతులు చంద్రశేఖర్ రెడ్డి, భార్య కవిత, కూతురు శ్రీత రెడ్డి(9వ తరగతి), కుమారుడు విశ్వన్ రెడ్డి(5వ తరగతి)గా గుర్తించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (44) కుటుంబంతో కలిసి గత ఏడాది హైదరాబాదులోని హబ్సిగూడకు వచ్చాడు. స్ట్రీట్‌ నెంబర్‌ 8లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ రెడ్డి నారాయణ కాలేజీలో లెక్చరర్ గా పని చేసి ఆరు నెలల క్రితం ఆ ఉద్యోగం మానేశాడు. మరో ఉద్యోగం దొరకక.. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో చంద్రశేఖర్ రెడ్డి, కవిత దంపతులు మానసికంగా కృంగి పోయారు.  ఈ క్రమంలో కుమార్తె శ్రీత రెడ్డి(15)ని ఉరేసి చంపి, కుమారుడు విశ్వాన్ రెడ్డి(10) కి విషమిచ్చి చంపేసి చంద్రశేఖర్ రెడ్డి, కవిత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

సూసైడ్ నోట్ లభ్యం..

చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదని.. వేరే మార్గం లేక సూసైడ్ చేసుకుంటున్నందుకు క్షమించండని లేఖలో పేర్కొన్నాడు. మానసికంగా శారీరకంగాను, కెరీర్ లోను చాలా సమస్యలు ఎదుర్కొన్నానని.. నరాలు కిడ్నీ సంబంధిత వ్యాధులు, మధుమేహంతో బాధ పడుతున్నానని వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్లో చంద్రశేఖర్ పేర్కొన్నాడు.