Kashmir | ఎల్ఈటీ టాప్ ఉగ్ర‌వాది హ‌తం

Kashmir పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌ మ‌సీదులో న‌మాజ్ చేస్తుండ‌గా కాల్చివేత‌ భార‌త్‌కు వాంటెండ్ టెర్ర‌రిస్టు విధాత‌: పాకిస్థాన్‌ ఆక్రమిత క‌శ్మీర్‌లోని ఓ మసీదులో శుక్రవారం భారత్‌లో వాంటెడ్ టెర్రరిస్టును గుర్తు తెలియని వ్య‌క్తులు కాల్చి చంపారు. రావల్‌కోట్‌లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌ను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్చారు. శుక్ర‌వారం ప్రార్థనలు చేయడానికి కోట్లి నుంచి రియాజ్ అహ్మద్ రాగా, ముందే మాటువేసిన […]

  • Publish Date - September 9, 2023 / 12:38 AM IST

Kashmir

  • పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌ మ‌సీదులో
  • న‌మాజ్ చేస్తుండ‌గా కాల్చివేత‌
  • భార‌త్‌కు వాంటెండ్ టెర్ర‌రిస్టు

విధాత‌: పాకిస్థాన్‌ ఆక్రమిత క‌శ్మీర్‌లోని ఓ మసీదులో శుక్రవారం భారత్‌లో వాంటెడ్ టెర్రరిస్టును గుర్తు తెలియని వ్య‌క్తులు కాల్చి చంపారు. రావల్‌కోట్‌లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌ను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్చారు. శుక్ర‌వారం ప్రార్థనలు చేయడానికి కోట్లి నుంచి రియాజ్ అహ్మద్ రాగా, ముందే మాటువేసిన వ్య‌క్తులు అత‌డిని హ‌త‌మార్చారు.

నిషేధిత లష్కరే తోయిబా (ఎల్ఈటీ ) ఉగ్ర‌వాద సంస్థ ద‌ళ క‌మాండ‌ర్ ఉన్న రియాజ్ అహ్మద్ జనవరి ఒక‌టిన జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజౌరీ జిల్లా ధంగ్రీ గ్రామంలో జరిగిన ఉగ్రదాడి వెనుక ప్రధాన కుట్రదారుల్లో ఒకడు. ధంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు జ‌రిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. వాస్తవానికి జమ్ము ప్రాంతానికి చెందిన అహ్మద్.. 1999లో సరిహద్దు దాటి పాక్‌కు పారిపోయాడు. జంట సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీల్లో ఉగ్రవాద కార్యక‌లాపాల‌ను రియాజ్ అహ్మ‌ద్ పున‌ద్ధ‌రించాడ‌ని అధికారులు తెలిపారు.