Uttar Pradesh | విధాత: పట్ట పగలే ఇండ్ల మధ్యలో ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ వ్యక్తిపై రెండు, మూడు రౌండ్ల కాల్పులు జరిపి పరారీ అయ్యాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ కాల్పులు కలకలం సృష్టించాయి.
వివరాల్లోకి వెళ్తే.. మోర్దాబాద్ జిల్లాలోని ఠాకూర్‌ద్వారా ఏరియాలో ఓ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిని ఓ యవకుడు ఫాలో అయ్యాడు. ఓ కాలనీకి చేరుకున్న తర్వాత.. ఇద్దరిలో ఒకరిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. మొదటి బుల్లెట్ కాలికి తగిలింది.
అప్రమత్తమై పరుగు తీస్తున్న అతనిపై మరో రెండు రౌండ్ల కాల్పులు జరిపి పరారీ అయ్యాడు. అయితే ఈ కాల్పుల ఘటనలో విశాల్ కుమార్ చనిపోయాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని బిలాల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుత ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
In a daylight murder caught on camera, a man named Vishal Kumar was gunned down in a lane on Thakurdwara area in UP’s Moradabad district. The suspect has been identified as Bilal who is on the run. The motive behind the murder is yet to be ascertained.#UttarPradesh #india pic.twitter.com/RbrSaog96f
— Siraj Noorani (@sirajnoorani) November 27, 2022