అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు: టీచర్‌గా మారి పాఠాలు చెప్పిన ఎమ్మెల్యే రెడ్యానాయక్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయన సీనియర్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి.. రాజకీయాలలో తలపండిన నాయకుడు. అయితేనే ఒక పాఠశాలకు వెళ్ళగానే పిల్లలను చూసి టీచర్‌గా మారిపోయారు. ఆయన డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్‌ రెడ్యా నాయక్. వెన్నారం పాఠశాలకు చేరగానే తరగతిలో బ్లాక్ బోర్డ్ వద్దకు చేరి, చాక్ పీస్ అందుకని చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అ..అంటే అమ్మ., ఆ..అంటే ఆవూ, ఇల్లు ఈగ అంటూ తను చదువుకున్న పాఠాలను విద్యార్థులకు బోధిస్తూ […]

  • Publish Date - February 17, 2023 / 07:41 AM IST

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయన సీనియర్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి.. రాజకీయాలలో తలపండిన నాయకుడు. అయితేనే ఒక పాఠశాలకు వెళ్ళగానే పిల్లలను చూసి టీచర్‌గా మారిపోయారు. ఆయన డోర్నకల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్‌ రెడ్యా నాయక్. వెన్నారం పాఠశాలకు చేరగానే తరగతిలో బ్లాక్ బోర్డ్ వద్దకు చేరి, చాక్ పీస్ అందుకని చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

అ..అంటే అమ్మ., ఆ..అంటే ఆవూ, ఇల్లు ఈగ అంటూ తను చదువుకున్న పాఠాలను విద్యార్థులకు బోధిస్తూ బ్లాక్ బోర్డుపై రాస్తూ వివరించారు. తాతయ్య వయసు ఉండే ఆ ఎమ్మెల్యే పాఠాలు వింటూ చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ మండలం పాఠశాలలో ఎమ్మెల్యే ఉపాధ్యాయునిగా మారి చిన్నారులకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ విద్యాబోధన చేసారు. అధికారులు అనుచరులు సైతం సంతోషంతో పాఠాలు వినడం విశేషం.