Karimnagar: మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం.. చర్ల బూత్కూర్‌లో కూలిన సభా వేదిక

మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలు విధాత, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మండలం చర్ల బూత్కూర్ గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన వేదిక పైకి మంత్రి చేరుకోగానే, వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంత్రితో సహా వేదికపై ఉన్న నాయకులు, కార్యకర్తలు కింద పడిపోయారు. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ కు […]

  • Publish Date - April 16, 2023 / 09:50 AM IST
  • మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలు

విధాత, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మండలం చర్ల బూత్కూర్ గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఏర్పాటు చేసిన వేదిక పైకి మంత్రి చేరుకోగానే, వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంత్రితో సహా వేదికపై ఉన్న నాయకులు, కార్యకర్తలు కింద పడిపోయారు. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలు కావడం తో ప్రధమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వేదికపైకి పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలోకి చేరుకోవడంతో కూలినట్టు స్థానికులు చెపుతున్నారు.

మంత్రి గంగుల కమలాకర్ కామెంట్స్

వేదిక కూలిన ఘటనలో తనకు చిన్న గాయమే అయిందని మంత్రి తెలిపారు. పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యునికి కాలు విరిగినట్టు తెలిసిందన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు.