ట్రాన్స్‌జెండర్ మెన్ ప్రేమ పెళ్లి.. సంతోషంలో ప్రియురాలు
ఓ ట్రాన్స్‌జెండర్ మెన్ తన ప్రియురాలిని చట్టబద్దంగా పెళ్లి చేసుకున్నాడు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఫ్యామిలీ కోర్టు నుంచి ధృవీకరణ పత్రాన్ని పొందారు

భోపాల్ : ఓ ట్రాన్స్‌జెండర్ మెన్ తన ప్రియురాలిని చట్టబద్దంగా పెళ్లి చేసుకున్నాడు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకుని ఫ్యామిలీ కోర్టు నుంచి వివాహ ధృవీకరణ పత్రాన్ని పొందారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌కు చెందిన అల్కా సోని ఆడపిల్లగా జన్మించింది. కానీ ఆమెలో అన్ని పురుష లక్షణాలు ఉన్నాయి. దీంతో తీవ్ర కలత చెందిన అల్కాసోని.. చివరకు తన 47వ ఏట లింగ మార్పిడి చేయించుకుంది. లింగ మార్పిడి చేసుకున్న అల్కాసోని.. అస్థిత్వ సోనిగా పేరు మార్చుకుంది.

ఇక చిన్ననాటి స్నేహితురాలైన ఆస్థాను అస్థిత్వ సోని ప్రేమ వివాహం చేసుకున్నాడు. చట్ట బద్దంగా వీరు వివాహం చేసుకుని ధృవీకరణ పత్రాన్ని పొందారు. ఇక డిసెంబర్ 11వ తేదీన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోనున్నారు.
అస్థిత్వ సోదరి వద్దకు ఆస్థా రావడంతో.. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మనసులు కలిశాయి. అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అల్కాసోని తన 47వ పుట్టిన రోజు సందర్భంగా లింగ మార్పిడి చేయించుకుని తన ప్రియురాలిని పెళ్లాడాడు.