అత్తను 10 ముక్కలుగా నరికి చంపిన అల్లుడు.. ఎందుకంటే..?
Rajasthan | క్షణికావేశంలో అత్తను అల్లుడు విచక్షణారహితంగా నరికేశాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 10 ముక్కలుగా నరికాడు. ఇక ఆ భాగాలను బకెట్, సూట్‌కేసులో కుక్కి.. నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌లోని విద్యాధర్ నగర్‌లో అంజు శర్మ(32) అనే యువకుడు తన తండ్రి, సోదరి, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. కరోనాతో గతేడాది అంజు శర్మ తల్లి చనిపోయింది. అయితే అత్త భర్త […]

Rajasthan | క్షణికావేశంలో అత్తను అల్లుడు విచక్షణారహితంగా నరికేశాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 10 ముక్కలుగా నరికాడు. ఇక ఆ భాగాలను బకెట్, సూట్‌కేసులో కుక్కి.. నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌లోని విద్యాధర్ నగర్‌లో అంజు శర్మ(32) అనే యువకుడు తన తండ్రి, సోదరి, మేనత్తతో కలిసి ఉంటున్నాడు. కరోనాతో గతేడాది అంజు శర్మ తల్లి చనిపోయింది. అయితే అత్త భర్త కూడా చనిపోవడంతో.. ఆమె కూడా అంజు ఇంట్లోనే ఉంటుంది.
డిసెంబర్ 11వ తేదీన తండ్రి, సోదరి బయటకు వెళ్లగా, అత్త, అల్లుడు ఇద్దరే ఉన్నారు. అదే రోజు అంజు కూడా ఢిల్లీకి వెళ్లాలనుకున్నాడు. కానీ అత్త అతన్ని ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శర్మ.. ఆమె టీ ప్రిపేర్ చేస్తుండగా సుత్తితో మోదాడు. తీవ్ర గాయాలపాలైన అత్త కిచెన్‌లోనే పడిపోయింది. కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది.
దీంతో అత్త శరీరాన్ని మార్బుల్ కట్టర్‌తో 10 ముక్కలుగా కోసేశాడు. ఆ శరీర భాగాలను సూట్‌కేసు, బకెట్‌లో కుక్కాడు. అనంతరం వాటిని తీసుకొని జైపూర్ – శిఖర్ హైవే ప్రాంతానికి వెళ్లి, నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.
ఇక అత్త కనిపించడం లేదంటూ అంజు నటించడం మొదలుపెట్టాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా అంజును విచారించారు. కానీ నిజం బయటకు రాలేదు. అనుమానంతో ఇంటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, డిసెంబర్ 11న సూట్‌కేసు, బకెట్‌తో అంజు బయటకు వెళ్లినట్లు దృశ్యాలు నమోదు అయ్యాయి. వాటిపై ఆరా తీయగా, చేసిన నేరాన్ని అంజు అంగీకరించాడు. కిచెన్‌లో రక్తపు మరకలు ఉండటాన్ని కూడా పోలీసులు గమనించారు. దీంతో అంజు శర్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.